Friday, May 21, 2010

జన సంఖ్య ఎక్కువైనందున

జన సంఖ్య ఎక్కువైనందున దుర్వాసనగల దురలవాట్లుగల అతి చేష్టలు చేసే రోగ పిచ్చివాడు
నీ ప్రక్కనే కూర్చొని వంద సంవత్సరాలు కలసి ప్రయాణిస్తుంటే నీకు జీవితంపై విరక్తి కలగదా
శుభ్రత లేదు సరైన వస్త్ర ధారణ లేదు విశాలమైన ప్రదేశం లేదు సరైన గాలి అందటం లేనేలేదు
ఎటుచూసిన చూడలేకపోతున్నా సరైన ఆహారం తినలేకపోతున్నా స్వేచ్చగా జీవించలేకపోతున్నా
జీవిత సమస్యలతో సమాజ సమస్యలతో సరైన సౌఖర్య సదుపాయాలు లేక ఇబ్బందులతోనే
ఏనాడు మారని సమాజం ఏనాడు తీరని సమస్యలు జనసంఖ్య ఎక్కువగుటలో అర్థం కాలేక
జీవితాలు ఏ దిక్కున సాగుతాయో తెలియని గమ్యంలా ప్రాణాలు తోడేసే కలి కాల జీవన విధానం
ప్రకృతి ప్రళయాలకు అదోగతిపాలైనా మానవునిలో అతి ఆశా అజ్ఞానం తొలగటం లేదంటే
సామాన్యుడు జీవించలేక భిక్షాటనతో దిక్కులు పోయిన పాపిలా సమాజంలో రోగ పిచ్చివాడిలా

No comments:

Post a Comment