Tuesday, May 25, 2010

నా మేధస్సులో ఏ రహస్యాలు

నా మేధస్సులో ఏ రహస్యాలు లేవో ఆ భావాలే ఆలోచనలుగా విశ్వమున
నా మేధస్సులో ఏ భావాలు లేవో వాటికై ఆలోచనలు విశ్వ ప్రయాణమున
నా మేధస్సులో ఏ ఆలోచనలు లేవో ఆ భావాలకై విశ్వమున అన్వేషణ
నా మేధస్సులో ఏ స్వభావాలు లేవో వాటి తత్వాలకై భావాలు విశ్వములోనే
నా మేధస్సులో ఏ విజ్ఞానం లేదో దానికై విశ్వమున రహస్య మర్మాన్వేషణ
నా మేధస్సులో ఏ కాలం లేదో ఆ సమయమే నాలో విశ్వకాలమై సాగేలా
నా మేధస్సులో ఏది లేదో దానికై నిరంతర అన్వేషణ విశ్వముననే సాగేను
నా మేధస్సులో విశ్వమే చేరే వరకు నిత్యం ధ్యాన భావ ఆధ్యాత్మ జీవనం

No comments:

Post a Comment