ఏ జీవి ధరించినదో గత జన్మలో నా ఆత్మను నేడు నే మహా కర్మను అనుభవిస్తున్నా
గత జన్మలలో ఏ ఏ రూపాలతో ఎంతటి కర్మలను అనుభవించి నా జన్మకై వచ్చింది
నా జన్మతో ఇంకా మహా ఘోర కర్మలను అనుభవిస్తూ మర్మగా జీవిస్తూనే ఉన్నది
కర్మలతో విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నందువల్ల మరో కర్మను చేయలేకపోతున్నా
విజ్ఞానంతో గత కర్మలు తరుగుటకు నేను ధ్యానిస్తూ ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తున్నా
నా జన్మలో ఆత్మ కర్మలను శూన్యం చేసుకొని మరో జన్మలేక విశ్వంలో ఇక్యమగును
కొన్ని గతజన్మల ఆత్మ కర్మలు వికృతమైనా నేటి జన్మలో ఇంకా ఘోర కర్మలు చేస్తూ
గత జన్మలతో ఆత్మ విసుగు చెందినా మానసిక ఆత్మ ప్రశాంతత లేక ప్రయాణిస్తూనే
కర్మ నాశనం అయ్యే వరకు ఆత్మకు ప్రశాంతత లేనివిధంగా జన్మలు పొందుతూనే
కోట్ల జన్మలు పొందినా ఇంకా కొన్ని ఆత్మలు కర్మలను అనుభవిస్తూనే జీవిస్తున్నాయి
ఆధ్యాత్మక విజ్ఞానం లేకనే కర్మలను పెంచుకుంటూ ఆనాటి నుండి నేటి వరకు
ప్రతి జీవి ధ్యానించే వరకు కర్మలు విశ్వంలో సాగుతూ ఉంటాయని కర్మ సిద్దాంతం
No comments:
Post a Comment