మహా రహస్యాలు తెలిసినవారు మరణిస్తే మన మేధస్సుకు తెలిసేదెలా
రహస్యాలలోని విజ్ఞానం మనకు తెలియకపోతే మేధస్సులో కొంత అజ్ఞానమే
ఆనాటి కాలం నుండి నేటి వరకు విశ్వ రహస్యాలతో మరణించిన వారెందరు
మరణించిన వారి రహస్యాలను గ్రహించుటకు శ్వాసనే ఏకాగ్రతతో గమనిస్తున్నా
ఏ రహస్యమైనా నా మేధస్సులో చేరేలా నా శ్వాస విశ్వంలో వారి ఆత్మలతో ఏకమై
రహస్యాలను విజ్ఞాన భావాలతో మర్మముగా మేధస్సు మరో ధ్యాసలో గ్రహించేలా
అజ్ఞానమే లేని విజ్ఞాన మేధస్సుగా ఎదగటమే నా విశ్వ భావ అన్వేషణ రహస్యము
No comments:
Post a Comment