Friday, May 28, 2010

నా మరణ విధానాన్ని ముందే

నా మరణ విధానాన్ని ముందే గుర్తు చేసుకుంటున్నాను
విశ్వం ఓ సందేశాన్ని తెలుపుతూ మరణించే వేళ ఆసన్నమే
నాలో మహా కార్య భావాలు ఆగి ఆలోచనలు సతమతమే
శ్వాసపై గమనం ఎక్కువైపోతున్నది ఎప్పుడు వెళ్తుందోనని
ఎవరికి ఏది తెలుపాలో మరచిపోయినవి ఏవి ఉన్నాయో
మాటలు ఆగిపోతూ మాట రాక మౌనంతో చూస్తూనే
కళ్ళు కూడా మసక మసకతో ఏదీ సరిగా కనిపించుటలేదు
మేధస్సులో ఆలోచనలు కూడా మరో ధ్యాసలో వెళ్లిపోయేలా
శరీర ప్రక్రియలు కూడా అస్థవ్యస్తంగా అవయవాల పనితీరు ఆగేలా
ఆత్మ దేనినో లాగేస్తున్నట్లు అనిపించేలోగా శ్వాస విశ్వంలో
ఆత్మ సూక్ష్మమైపోయి విశ్వంలో మర్మగా దూసుకుపోతున్నది
శరీరం నశించుటలో భావాలు లేక పంచభూతాలతోనే
మరణంతో నా వారిలో తెలియని భావాలు మొదలైనాయి
తెలియకనే ముఖ భావాలు మారి ఆందోళనతో కన్నీరు కారేలా
ఏం చేయాలో వారికి కూడా మాటలు తడబడుతున్నాయి
కొంత సమయానికి మరణ వార్తను తెలిసిన వారికి తెలిపేలా
ఆకాశం కూడా నిర్మానుషంగా మారి ప్రతి జీవి మౌనమైపోయెను
మరో రోజు నా భావాలు వారిలో మొదలై నా భావ జీవితాన్ని తెలుపుకున్నారు
మరణ భావన లేని వారికి మరణం సంభవించినా విశ్వంలోనే ఉంటారని

No comments:

Post a Comment