శ్రీ కృష్ణుడే నాకు తెలిపిన భావాలు ఇవే ఇలాగే
నేను భగవంతుడను కాను నేనేదీ సృష్టించలేదు
నాకేవి మాయా మర్మములు తెలియవు రావు
నేను జీవితాన్ని అర్థం చేసుకుంటూ జీవిస్తున్నా
విశ్వమే నా గురువు శ్వాసే నా ప్రాణం నేనే శ్రీ
నాకు తెలిసినది కార్య కారణ భావ సూత్రమే
ఏది చేసినా తెలిపినా ఎరుకతో నడిపించుటయే
జీవితాన్ని విజ్ఞానంగా సాగించుటయే పరమార్థం
నేను గ్రహించినది ధ్యానించుటలో శ్వాసపై గమనం
శ్వాసపై గమనం ఉన్నవాడు అజ్ఞానంగా ప్రవర్తించలేడు
ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా ఎవరికైనా శ్వాసపై ధ్యాస
శ్వాసలోని మాయా మర్మములు మేధస్సునకే రహస్యము
మరో మాహాత్ములైనా తెలిపేది ఇదే ఇలాగే ఇంతే కదా
మనమేది తెలుపని రహస్య మర్మమే భగవంతుడు
ఆకార రూపమైనా ధ్వని వర్ణమైనా స్థాన ప్రదేశమైనా
తెలియదు చూడలేదు వినలేదు గ్రహించలేదు భావమైనా లేదు
No comments:
Post a Comment