ఒక రోజంతా నా నేత్రములకు సూర్యుడికి మధ్య ప్రదేశాన ఏదీ రాలేదు
మేఘమైనా గాలి ఐనా ధూళి ఐనా పక్షి ఐనా జీవి ఐనా ఎదీయు రాలేదు
ఆ రోజంతా సూర్యున్ని తిలకిస్తూనే సాగుతూ అలాగే నక్షత్రాన్ని దర్శించాను
మరల సూర్యోదయం వరకు నక్షత్రాన్ని తిలకిస్తూనే నా నేత్రాన్ని కప్పివేశాను
సూర్యున్ని నక్షత్రాన్ని మాత్రమే తిలకించిన ఆ రోజు దివ్య భావాలతో సాగింది
సూర్య ప్రకాశ కిరణాలు నక్షత్ర తేజస్సు కాంతులు నా నేత్రాలలో దివ్యమైనాయి
No comments:
Post a Comment