మన జీవిత కాల అజ్ఞాన విజ్ఞానమంతా నుదిటిపై లిఖించబడుతున్నది
మరో జన్మలో మన అజ్ఞాన విజ్ఞాన భావాలు సాగేందుకు నిదర్శనాలివే
మనం నేడు అనుభవిస్తున్న కర్మలు గత కాల అజ్ఞాన భావ ప్రభావాలే
నుదిటి రాతను మార్చుకోవాలంటే అజ్ఞాన కర్మను వదిలించుకోవాలి
మహా భావాల సాధనతో ధ్యానిస్తే కర్మ శూన్యమై విజ్ఞానం ప్రజ్వలిస్తుంది
అజ్ఞానం లేనివారికి నుదిటిపై విజ్ఞాన గీతలే సువర్ణంతో లిఖించబడును
No comments:
Post a Comment