విశ్వం నీ శ్వాసను పలకరిస్తున్నది మిత్రమా! లోకాన్ని తిలకించి చూడు
విశ్వమున మరల రాని దివ్య విజ్ఞాన క్షణాలు నీ కోసమే వేచియున్నాయి
విశ్వ రూపాలు బహు వర్ణ అద్భుత ఆరా స్వయం ప్రకాశాలుగా ఉన్నాయి
సూక్ష్మంగా తిలకించుటలో విశ్వ కాంతులు ఇంద్ర ధనుస్సు వర్ణ భావాలు
శ్వాసలో లీనమై విశ్వముగా ఉన్నాను ఓ క్షణాన ధ్యానించి తిలకించు
మరల రాని విజ్ఞాన భావ మానవ జన్మ క్షణాలతో నీకై ఎదురు చూస్తున్నది
విశ్వ విజ్ఞానం నీ మేధస్సులో చేరేందుకు ప్రతి క్షణం శ్వాస అన్వేషిస్తున్నది
ఏకాగ్రత లేనిదే విశ్వ తత్వ భావాలను గ్రహించలేవు విజ్ఞానం చెందలేవు
No comments:
Post a Comment