ప్రతి క్షణాన్ని విశ్వ విజ్ఞానంతో అన్వేషిస్తూ మహా దివ్య భావాలను సేకరిస్తున్నా
మేధస్సులో కలిగే ఆలోచనలు విశ్వపు అంచుల వరకు ప్రయాణిస్తూనే ఉనాయి
విశ్వమున ఏ అణువు ఏ స్వభావంతో ఉన్నానా మేధస్సుకు చేరుతున్నది
నా మేధస్సుకు తెలియకుండా ఏ అణువు స్వభావం మారదని గ్రహించి ఉన్నా
భూత భవిష్య స్వభావాలకు నేనే మూలాధారంగా నా భావాలు నిలిచి ఉంటాయి
No comments:
Post a Comment