ప్రతి పనిలో గాని జీవిత వృత్తిలో గాని సంతోష దుఖ్ఖాలు ఉంటాయి
సంతోషం ఎక్కువగా ఉంటే పని సాగిపోతుంది దుఖ్ఖమైతే నిదానమవుతుంది
ఇబ్బందిగా ఉంటే మరో కొత్త పనిని చేయడానికి ఇష్టమవుతుంది
దుఖ్ఖంతో పని చేస్తుంటే పని భారమై ఏదో విధంగా సాగిపోతుంది
జీవితంలో ఏ పని ఎలా చేయాలో తెలుసుకుంటే కాలం జ్ఞానంగా సాగుతుంది
కొన్ని పనులను దుఖ్ఖమైనా సుఖమైనా చేసుకుంటూ పోవాలి
జీవిత ప్రయాణం కొన్ని పనుల ద్వారానే మలుపు తిరుగుతుంది
No comments:
Post a Comment