ఆకాశంలో ఒక్కడివే వేగంగా పరుగులు తీస్తుంటే మేఘాలు కరిగేలా పిడుగులే అదిరేలా -
అంతరిక్షంలో గ్రహాలతో తిరుగుతుంటే భూమి ప్రకంపించేలా అగ్ని జ్వాలలు పేలిపోయేలా -
సముద్రాలలో ఈదుతుంటే సుడిగుండాలు చెదిరేలా కెరటాలు ఆకాశానికి ఉప్పొంగేలా -
భూ పొరలలో దూసుకు వెళ్ళుతుంటే సూర్య కిరణాలను ఓడించేలా ముందుకు సాగేలా -
పక్షులతో ఎగురుతుంటే సుడి గాలులే భూమిని చుట్టేలా జీవులు ధూళిలో కలిసిపోయేలా -
సృష్టి ప్రభావాల భయంకరాలు ఇలాగే ఉండవచ్చని నాకే ఓ ఆలోచన హెచ్చరిస్తున్నది -
No comments:
Post a Comment