Saturday, May 8, 2010

ఈ జీవితాన్ని మరవలేను

ఈ జీవితాన్ని మరవలేను మరోసారి జన్మించడం అవసరం లేనేలేదు
అన్నీ తెలుసుకున్నాను మేధస్సులో అన్నీ ధృడంగా భద్రపరిచాను
ఇంతవరకు ఏమి ఎలా జరిగిందో రాబోయే కాలాన ఏం జరుగుతుందో
అన్నీ తెలిసేలా నాలో విజ్ఞాన భావాలు ఎరుకతో చలిస్తూనే ఉన్నాయి
అనుభవంతో అనుభవిస్తూ యుగాలుగా ఆత్మతో ధ్యానిస్తూ శ్రమించాను
ప్రతీది నాలో ఉన్నట్లు నేనే ప్రతీది అన్నట్లు విశ్వమే నేనని తెలిసేలా
నన్ను నేను మరవలేను మరణించినా మరో జన్మ లేక భావనతో విశ్వంలో

No comments:

Post a Comment