Saturday, May 8, 2010

ఎలా మరచిపోయానో మరిచినది

ఎలా మరచిపోయానో మరిచినది గుర్తురాక అలాగే సాగిపోయాను
అవసరమయ్యేంత వరకు మరచినది గుర్తురాక అప్పుడు తెలిసినది
నేను ఓ ఆలోచనను మరచిపోయానని గుర్తు వచ్చేదాక మరవలేనట్లు
నా ఎరుక తెలుపలేదు మరచిపోయిన దానిని సరి చూసుకోమని
అన్నీ సరిచూసుకోమని ఆలోచన కలిగినా మరచినది చూసుకోలేక
ఉన్నవాటిని సరి చూసుకుంటూ అవసరమయ్యేంత వరకు మరచినట్లే
మరచినది తెలుసుకోవాలని ఒక దృఢ ఆలోచనగా నిబంధనగా
కావలసిన వాటిని బయలుదేరుటకు ముందు మళ్ళీ అన్నీ సరి చూసుకోవాలనే
ఎప్పటికి మరవలేక ఎప్పుడూ నిబంధనగా అన్నీ గమనిస్తూ సరిచూసుకునే
బయలుదేరుటకు కార్యాన్ని ఆరంభించేలా జాగ్రత్త వహిస్తున్నాను
అవసరమైన వాటిని సరిచూసుకున్న తర్వాతనే కార్యాన్ని ప్రారంభించాలి

No comments:

Post a Comment