తర్క శాస్త్రము తెలిస్తే ప్రతి కార్యము విజయమే
కార్య కారణ భావమే తర్క శాస్త్ర విజ్ఞాన సూత్రము
కారణమును తెలిపే మూల రహస్య విధానమే శాస్త్రము
ప్రతి కార్యమునకు కారణము ఒక విజ్ఞాన సూత్రము
విజ్ఞానంగా చేసే కార్యమే కారణమును తెలుపును
కారణమున తెలియు భావాలు గ్రహించినవే శాస్త్రములు
శాస్త్రము తెలిసిన వారికి కార్యము సులువుగా జరుగును
కార్యాలను త్వరగా పూర్తి చేయుటకు కూడా శాస్త్రమే
శాస్త్రము నందు రహస్యము కార్యమున నిమగ్నమైన ఏకాగ్రత
ఏకాగ్రతగా ఉంటే సూత్రాల శాస్త్రీయములు మేధస్సున ఎన్నో
సూత్ర శాస్త్రమంటే లోటులేని సూటిగా వెళ్ళే/చేసే మార్గము
No comments:
Post a Comment