విశ్వం ఉదయిస్తుందని మరల రేపటి సూర్యోదయాన తెలిసింది
ఆనాటి మానవ మేధస్సు గ్రహించని భావనను నేను సేకరించా
ఆనాటి విశ్వ కాలమున మానవ విజ్ఞానము ఆరంభమయ్యే దశలో
విశ్వమున ఏది జరుగుతుందో ఏది ఎందుకో తెలియని విధంగానే
చీకటైన వేళ మరల వెలుగు వస్తుందో లేదో తెలియని స్థితిలో
ఎన్నో విషయాలను పరిశీలిస్తూ అవగాహన చేస్తూ తెలుసుకుంటున్నాడు
ఇంకా తెలియని విషయాలు ఎన్నో విశ్వముననే దాగి ఉన్నాయి
ఆనాటి భావాలన్నీ నా మేధస్సులో అనంతమై విశ్వమే నిక్షిప్తమై ఉన్నది
No comments:
Post a Comment