జీవితాలు ఒకటే కావు కుటుంబం ఒకటైనా జీవితాలు వేరుగానే
ఎవరికి వారు ఎవరి జీవితం వారిదేనని జీవిస్తూ సాగిపోవాలి
కలసి ఉన్నా ఎప్పటికైనా విడిపోవాలనే జీవిత ఆశయాలు వేరే
కాలం కూడా మనల్ని విడదీసేలా ఎవరికి వారు ఒకరేనని
కలిసే ఉందామనుకున్నా మనలో ఒకరికి వేరే అభిప్రాయం
కలిసి ఉన్నప్పుడే సంతోషంగా జీవించండి మాట జాగ్రత్త
కలిసే కాలం రాదు వస్తే విడిపోవాలనే ఎదురు చూసే విధంగా
లోకం ఒకటైనా ఆలోచన విధానాలు కాల ప్రభావాలు వేరుగానే
నాకు అందరు ఒకటే ఐనా మీలో మీకు నేను వేరుగా కలిగేలా
మానవత్వం అసూయగా ఉంటే ఆత్మతత్వం ఎప్పుడు కలుగుతుంది
వేరుగా జీవించినా ఒకటే భావనతో కలిసిపోయేలా ఎదురు చూడటమే
జీవితాన్ని తెలుసుకొనుటకు విశ్వ విజ్ఞానం ధ్యాన విధాన భావం
No comments:
Post a Comment