Wednesday, May 12, 2010

మాట మీద నిలబడలేని

మాట మీద నిలబడలేని వాళ్ళకు కాళ్ళు ఎందుకో
ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట మార్పు
ఆవశ్యకతను కూడా అర్థం చేసుకోని విధంగా ప్రవర్తిస్తే
వారికి యేమని ఎలాంటి మాటలతో తెలియజేయాలి
చేత కాకపోయినా చేస్తానని మరల చేయలేనని తెలిపి
మనకే అనవసర కారణాలు చెప్పి వేరొక పనిని కలిపిస్తారు
మనం మంచి వాళ్ళమని వాళ్ళ పని చేసినా కృతజ్ఞత లేదు
చివరికి వాళ్ళు మనకు చేసినది ఏం లేకున్నా సమస్యే
సమస్యలను కలిపించే వాళ్లతో సమాజం నాశనమే
వ్యక్తికి సరైన కృతజ్ఞత భావం చూపనివారు అజ్ఞానులే
ఇలాంటి అజ్ఞానులకు కాళ్ళు ఎందుకో సమస్యలు సృస్టిస్తారు
కళ్ళు కూడా లేకుండా ఉంటే అప్పుడు తెలుస్తుందేమో
ఎలా జీవించాలని ఎందుకు జీవిస్తున్నామని
ఎవరితో ఎలా ఉండాలని యేమని మాట్లాడాలని
మాట మీద ధ్యాసలేని వాడు అజ్ఞానియేనని నా భావన
ఎంత చదువు చదివినా విద్య నేర్చినా మాటపై ధ్యాస లేకపోతే
ఇంట్లోనే మాటలు నేర్చుకుంటూ ధ్యాసతో ఆలోచించండి పలకండి
సహాయం కోరడానికి వచ్చి కూడా సమస్యలను సృష్టిస్తున్నారు
మాట మీద ధ్యాసలేని లోకాన్ని చూడలేక కాలం క్షణం మీద ధ్యాసతో

No comments:

Post a Comment