ఒక వృక్షాన్ని నరికితే ఒక ఋషి మరణించినట్టే
ఒక వృక్షం మనకు ఎన్నో విధాల ఉపయోగమే
ఋషి కూడా విజ్ఞానంగా ఎంతో ఎదిగిన వాడు
గాలి నీడ వంట చెరకు ఎన్నో విధాల వృక్షం ఇచ్చినా
విద్య ప్రవర్తన సత్యం అనుభవాన్ని ఇచ్చేది ఋషియే
చెట్టు నుండి కూడా ఎంతో విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు
చెట్టు ఎప్పుడూ ఎన్నో విధాల మేలే చేస్తుందని
ఋషి జీవిత కాలం కన్నా వృక్ష జీవిత కాలం ఎక్కువే
ఋషి లేకున్నా వృక్షం లేకపోతేనే చాల సమస్య
వృక్షము నుండి విజ్ఞానము నేర్చిన వాడు ఋషియే
ఒక ఋషిగాని వృక్షం గురించి గాని ఎంతో తెలుపవచ్చు
వృక్షో రక్షతి రక్షితః ఋషియే బోధిత విజ్ఞానతః
No comments:
Post a Comment