ప్రతి జీవి దేహము దేవుడిగా మారేంతవరకు భావనగా నే విశ్వంలోనే
దేహమే దేవాలయమని ఏ మాధవుడు తెలిపినా ఎవరిలో మార్పులేదే
ప్రతిజీవి మార్పుకై దేహమే దేవుడని తెలిపితే విజ్ఞానంతోనైనా మారగలరేమో
దేవుడు లేని దేవాలయమని దేహాన్ని గ్రహించి అజ్ఞానంగా జీవిస్తున్నారేమో
దేహమే దేవుడిగా విజ్ఞానమే ఆలయముగా విశ్వమే మహా క్షేత్రమని నేను
దేవుడే మీరైతే మీలో ఏ భావాలు ఉన్నాయో తెలుసుకొని జీవించండి
దేవుడు లేడంటే మీరు లేరనే మీ శరీరం మరణించినదని గ్రహించండి
దేహమే దేవుడైతే ధ్యానమే అతనికి ఆధారం భావమే అతని దివ్యత్వం
No comments:
Post a Comment