మేధస్సు మహా యంత్రమే తంత్ర మంత్రాలను కూడా మాయ చేయగలదు
విశ్వ విజ్ఞానము తెలుసుకుంటే విశ్వ యంత్రంగా నీ మేధస్సు మారగలదు
జగతిలో నీవే సత్యవంతుడవైతే జగత్ తంత్ర యంత్రంగా నీ మాట నిలువగలదు
దేనినైనా ఎలాగైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ఏ పనైనా నేర్చుకొని చేయవచ్చు
ఎన్నో యంత్రాలను కనుగొని తయారుచేసి వాటితో పని చేసేలా చేయవచ్చు
యంత్రాలతో మరో వస్తువులను సృష్టించి మరో యంత్రాలుగా అమర్చవచ్చు
మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ఎలాగైనా వాడుకోవచ్చు
వేద రహస్యాలను కార్య కారణ భావ సూత్రాలను ఎన్నో విధాల గ్రహించవచ్చు
శాస్త్రీయ శస్త్ర చికిత్ర్స సూక్ష్మ కణ పరిజ్ఞానాన్ని కూడా ఎవరైనా తెలుసుకోవచ్చు
విశ్వంలో జరిగే ఎన్నో అనుభవాలను ఎంతో కాలంగా తెలుసుకుంటూనే ఉండవచ్చు
ప్రాపాంచికంగా ఆధ్యాత్మకంగా ధ్యాన భావాలతో కూడా విశిష్టతతో జీవించవచ్చు
మరణాన్ని శాశ్వితంగా నిలిపే జీవం తప్ప ఎన్నైనా సాధించవచ్చనే నా భావన
మేధస్సు ఎంతటి మహా యంత్రమో మీ విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది
No comments:
Post a Comment