ఉన్నవారు లేనివారినే ధన సహాయం చేయమని
పేదవాడు ధన సహాయం చేసినా తిరిగి ఇవ్వలేకనే
కనబడితే చాలు ముఖమే తిరగించి పక్క దారిలో
అడగాలని నేను అనుకున్నా అందనంత దూరంలో
కోట్ల ఆస్తి ఉన్నా వేలకై పేదవాడి సహాయం ఎందుకో
పేదవాడు నిరుపేదగా భిక్షపతి అయ్యేందుకో నేమో
ఉన్నవారు ఉన్నవారికి సహాయం చేయకనేమో
పేదవాడి జీవితాలు శ్రమించినా ఉన్నవారికే ఇచ్చేలా
ఒకరిని ధనం అడిగే జీవితం అజ్ఞాన ఆశయంతో కూడినదే
ధనవంతుడు సహాయం చేయకపోయినా పర్వాలేదు
పేదవాడిని సహాయం అడుగుటయే అజ్ఞాన అన్యాయం
తిరిగి ఇచ్చేంతవరకు ఎదురుచూసి ఆలోచించి మతిపోయేలా
ఇవ్వకపోతే ఆశతో ఎదురుచూస్తూ ప్రాణాలు వదిలిపోయేలా
జీవితాలను త్యాగం చేసే పేదవారు జీవించుటలో అర్థమేమిటో
దేనిని రుచించలేదు ఏ భోగభాగ్యాలు ఏనాడు అనుభవించలేదు
No comments:
Post a Comment