Monday, May 10, 2010

వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళాలో

వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళాలో ప్రతిరోజూ ఇలా
వచ్చేటప్పుడు ప్రతిరోజూ ఇంతేనా ఇంకేదైనా ఉందా
జీవితం ఎప్పుడూ ఒకేలా శ్రమతో కూడినట్లే
సమయం కాని వేళలో శ్రమించుట ఎందుకో
పొందేటప్పుడు ఏదైనా వస్తుందా అని ఆశతో
పొందిన తర్వాతా ఇంతేనా ఇంకేదైనా వస్తుందా
శ్రమించుటకై వెళ్ళేటప్పుడు నిరాశగా
శ్రమించిన తర్వాత వచ్చేటప్పుడు ఆశగా
దక్కేటప్పుడు వెళ్లేందుకు ఆశగా
దక్కిన తర్వాత వచ్చేందుకు నిరాశగా
ఎప్పుడు ఎలా అనిపించినా విశ్వభావన కలిగేలా
విశ్వవిజ్ఞాన సత్యానికై ఆలోచనలు అన్వేషించేలా

No comments:

Post a Comment