కార్య కారణ విషయ సూత్రాలను కనుక్కుంటే నీ మేధస్సు మహా విజ్ఞానంగా
ఎవరికి ఇంకా తెలియని రహస్య కారణాలను నీవు తెలుసుకోగలిగితే మేధావిగా
ప్రతి కార్యాన్ని ఏకాగ్రతగా పరిశీలిస్తూ ఆలోచిస్తే మూల రహస్యము తెలిసేలా
నేడు తెలిసిన రహస్యాలలోనే ఇంకా సూక్ష్మ విజ్ఞాన రహస్యాలు ఎన్నో దాగున్నాయి
విశ్వంలో దాగిన విజ్ఞానమే తెలుసుకునే వారికి రహస్యంగా తెలియునని నా భావన
రహస్య విజ్ఞానంతో నీ జీవితం కీర్తి ఖ్యాతులతో విశేషంగా మహా గొప్పగా ఉంటుంది
రహస్యాల క్షేత్రం విశ్వమైతే రహస్యాల నిధి నీ మేధస్సులో దాగినట్లు అన్వేషణ
No comments:
Post a Comment