మళ్ళీ మళ్ళీ రాదని ఆ క్షణమే నీకు తెలుపదు
మరో క్షణమే నీకు ఆ క్షణం రాదని తెలుపును
నీవు గ్రహించే క్షణం కూడా మళ్ళీ రాదనే
మరో క్షణాన తెలుసుకుంటావని క్షణమే తెలుపును
ఏ క్షణం ఏది గ్రహించినా ప్రతి క్షణం విజ్ఞానమేనని
క్షణాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకో తెలుసుకో
No comments:
Post a Comment