తల నరికే వారి తల నరికే వారు లేకనే తల నరికే అజ్ఞాన రాక్షసులు సాంకేతిక విజ్ఞాన కాలమున ఉన్నారు -
కోళ్ళు మేకలను నరకడాన్ని చూసి అజ్ఞానంగా సులువుగా మతిపోయిన ఆవేదనలతో పాపాత్ములై ఉన్నారు -
వెంటాడి వేటాడి పరుగులతో తల నరికితే అమ్మోరు తల్లి నీ తల నరకదా రక్తాభిషేకం చేసుకోదా ఆలోచించలేవా -
రైళ్ళ పట్టాలపై వాహనాలు ఆగే ప్రాంతాలలో నరికి తలలు అవయవాలు విసిరి వేయుట ఎందుకో అజ్ఞానంగా -
కోళ్ళు మేకలవలె నరికి భుజించునట్లు మానవుల తలలు నరికిన తర్వాత వండి భుజిస్తే నీకు జేజేలు నీ కుటుంభం పలుకుతుంది -
నీవు నరికిన వారు కూడా నీకు బంధువులో స్నేహితులో లేదా నీ స్నేహిత స్నేహితులే కదా సమాజమున అందరు ఒక్కటే కదా -
పగ ఉంటే న్యాయంగా సాధించు ఎవరో చెబితే నీవెందుకు నరకడం పాపాత్ముడిలా అందరికి భయంకర శత్రు జీవిలా -
తల నరికే వాడివైతే నీ కుటుంభాన్ని నీవే నరికి తర్వాత వీధి కుక్కలను నరకవోయ్ నరక లోకాన్ని నీకు రాసిస్తా నరికేందుకూ -
పాపాత్ములకు సలాం చేసే వారు ఉంటే మీసం మోలేసే నాయకుడు నరకాసూరుడైనట్లు గ్రామమున గతిలేని మతితో -
సలాం చేసే వాడే ఏనాడైనా నాయకుడి తల నరికితే గ్రామానికి పీడ విరగడైనట్లు శని వదిలినట్లు శాంతి తత్వం కలగదా -
అజ్ఞాని అమాయకుడిని లేదా విజ్ఞానవంతున్ని నరికితే రాక్షసుడు / విజ్ఞానవంతుడు అజ్ఞానిని నరికితే మాధవుడు : ఆనాటి కాలమున -
సాంకేతిక యంత్ర కాల విజ్ఞానమున నరికే వారెందుకో అలాగే చాటున కాల్చే పేల్చే మానవ జీవులు సమాజంలో ఎందుకో -
ఆధ్యాత్మిక జ్ఞానం లేకనే లోకాన ఇంకా ఎందరో అజ్ఞానులు జీవిస్తూనే ఉన్నారు విధిలేక మనం భయాలతో జీవిస్తున్నాం -
No comments:
Post a Comment