విశ్వరూపము ఎలా ఉన్నదో విశ్వమునకు తెలియదని భావనగా నాకు తెలిపెను
విశ్వరూపమును చూపించుటకై విశ్వమున రూపములన్నీ నా నేత్రమున అమర్చినా
నా నేత్రమున ప్రతి కణము అలాగే ఆకాశము కన్నా విశాల రూపము కనబడునట్లు
ఎంతటి రూపమైనా ఎలాగైనా చూడగలిగే విధంగా మహా అద్భుతంగా అమర్చియున్నా
నా నేత్రమున విశ్వరూపముల అమరిక విధానమును తిలకించి ప్రతిరూపాన్ని దర్శించెను
విశ్వమున ఏ మార్పు జరిగినా నా నేత్రమున కూడా అలాగే ఆ సమయాన మార్పు జరుగుతుంది
నా నేత్రమున విశ్వము మాత్రమే ప్రతి రూపాన్ని తాకగలదు రూపాన్ని కూడా మార్చగలదు
No comments:
Post a Comment