ఎక్కడి నుండి వస్తున్నారో ప్రతి రోజు మరల అక్కడికే వెళ్ళుతున్నారు
వచ్చిపోయే మధ్యకాలంలో ప్రయాణము సాగిస్తూ వృత్తిరిత్యా ఆర్థికంగా ఎన్నో
ప్రతి రోజు వచ్చి పోవుటలో అలసట ఖర్చు మానసిక సమస్యలు ఎన్నెన్నో
నిద్ర పోవుటకు కూడా సరైన సమయం లేక సమస్యల ఆందోళన దినచర్యలే
వృత్తి రిత్యా సమస్యలు ఎన్నున్నా మానసిక సమస్యలు మేధస్సులో గల్లంతే
వచ్చిపోవుటలో సమీప దూరమున్నచో ఆరోగ్యము అలాగే వృత్తిరిత్యా జయమే
పనిచేయు ప్రాంతపు ఆవరణముననే జీవిస్తే జీవితము సుఖ కాల ప్రయాణమే
వచ్చిపోవుటలో జనన మరణ కాల ప్రయాణము కూడా సమస్యల వలయంలోనే
ప్రయాణము ఎంత గొప్పగా ఉంటే జీవితము అంత అద్భుతంగా ఉంటుంది కదా
ప్రయాణ సమయాన్ని మేధస్సు ప్రశాంతతకై వినియోగిస్తే ఆలోచనలు విజ్ఞానంగా
ప్రయాణము విజ్ఞానముగా దివ్యంగా ఆత్మ సంతృప్తితో ఉంటే వచ్చిపోవుట ఎన్నిసార్లో
No comments:
Post a Comment