ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం - "Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, August 30, 2010
నా మరణంతో ఇది చివరి భావన
ఆత్మకు మరణం లేనందుకు నా భావాలోచనను పరిశుద్ధమైన పరమాత్మ తత్వంతో ఆత్మకే అంకితమిచ్చాను -
నా ఆత్మలో కలిగే నూతన భావనాలోచనలన్నీ విశ్వానికి భవిష్య విజ్ఞానంగా జగతిలోనే నిలిచి ఉంటాయి -
విశ్వము ఉన్నంత కాలము నా ఆత్మ భావాలతో జీవిస్తూ జీవులకు మహా విజ్ఞాన ఆలోచనలను కలిగించును -
మేధస్సు అరిగిపోయినా నా నుండి
రూపం క్షీణిస్తున్నా భావాలతో ఉత్తేజం కలుగుతూనే ఉంటుంది
మేధస్సులో అరిగిపోలేని భావాలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి
మేధస్సు అరిగిపోతున్నా విశ్వాన్నే మేధస్సుగా చేసుకుంటూ భావాలు జీవిస్తాయి
నూతన భావాలకై విశ్వమును దాటి
ఎప్పటికైనా నా మేధస్సుకు ఆ లోకం ఓ విజ్ఞాన క్షేత్ర యాత్రగా నిలిచి ఉంటుంది
భావనలేని క్షణం యాత్రా లోకాన్ని తిలకిస్తూ నూతన భావాలను అన్వేషిస్తుంటా
నా లోకంలో బ్రంహాండమైన భావాలు విశిష్టతతో ప్రతి క్షణం కలుగుతూనే ఉంటాయి
విశ్వమున బహు చిత్ర విచిత్ర
మానవ మేధస్సు యంత్రాలతోనే సాగుతూ వెళ్ళిపోతుంది
నూతన యంత్రాలతో కాలం గడిపే రోజులు భవిష్యత్ విధానం
సంతోషం వృత్తి చికిత్స ప్రయాణం ఎన్నో విధాల ఆధునిక సాంకేతిక యంత్రాలే
యంత్రాలు పనిచేసే విధానంతోనే కాల విజ్ఞానాన్ని మార్చుకుంటూ వెళ్లిపోతాము
ఒకరితో నేస్తం ఒకరితో బంధం ఒకరితో
మరొకరితో ద్వేషం మరొకరితో ఆవేదన ఇదేనా విజ్ఞాన కాలం
ఎంతో కాలం ఎందరితోనో వృధా కాల క్షేపం ఇదేనా ప్రగతి పథం
ఎందరో విజ్ఞానులు ఉన్నా అజ్ఞానులను మార్చేలేని విజయం స్వార్థం
అజ్ఞానులు ఉన్న చోటైనా మహా దివ్య విజ్ఞానులుగా మనం ఉంటే వారిలో మార్పు కలుగనేమో
అజ్ఞానాన్ని మార్చే దివ్య విజ్ఞానం కోసం ప్రతి రోజు కొన్ని క్షణాలు ధ్యానించలేరా మహానుభావా!
ఆకార రూపాలకు మోసపోవద్దు
అజ్ఞానమునకు కాలం వృధా చేయొద్దు
విజ్ఞానమునకే జీవితాన్ని సాగించు
కాలమే నీ విజ్ఞానాన్ని సాగిస్తూ ప్రయాణిస్తుంది
నేటి నుండి సమాజం మారాలని
సమస్యలు తొలగాలని సుఖంగా జీవించు
కాల ప్రభావాలు కలగరాదని విశ్వాన్ని ప్రేమించు
ధ్యానంతో జగతిని సద్విన్యోగం చేసుకో
విశ్వ కాంతిలో అణువును నేనైతే
భావాలెన్నో కలిగించుటకు వివిధ వర్ణాలతో మెరుస్తుంటాను
పున్నమి జాబిలిలో ఇంద్రధనస్సుగా ప్రతి అణువును నేనే
కాంతితో జీవించే విశ్వ రూపాలకు నా అణువే దివ్య కేంద్రం
ఏ జీవికిలేని మేధస్సు మనిషికే
సాధించే విజ్ఞాన విజయాలను అద్భుతంగా తిలకించుటకా
విశ్వ రూప భావాలను విజ్ఞానంగా తెలుసుకోవడానికే
విశ్వ విజ్ఞానాన్ని ప్రతి మానవుడు స్వీకరిస్తూ జీవించాలి
విశ్వాన్నే తిలకిస్తూ విశ్వ భావాలను తెలుసుకుంటూ విశ్వానికే విశ్వ విజ్ఞానాన్ని తెలపాలి
అవకాశం నీకున్నా కాలం నీ స్థానాన్ని
నీవనుకున్న దానిని నీకు కల్పించకుండా చేస్తుంది
విజ్ఞానంగా కాలాన్ని అర్థం చేసుకునే వరకు అయోమయం
విశ్వార్థ భావంతో జీవిస్తే ఏ క్షణం ఎక్కడున్నా విశ్వ స్థానమే
ఏ క్షణం ఎలా ఉన్నా విశ్వం కోరుకున్న భావనయేనని నేను
మరో జీవితానికి విజ్ఞానం చెందే
నేడు గ్రహించి విశ్వ విజ్ఞానం చెందవా నీవు ఓ సారి
మరో జన్మలో మానవ జీవిగా జన్మించలేకపోతే
విజ్ఞానం కలగడానికి ఎలాంటి అవకాశం ఉండదు
కాలం అజ్ఞానం కలిగిస్తున్నా మేధస్సు విజ్ఞానాన్ని గ్రహించాలి
నీలాంటి విశ్వ మేధావి ఇక
విశ్వ విజ్ఞానాన్నే మేధస్సులో అపారంగా దాచుకోలేవా
ఆకాశం కన్నా విశాలంగా మేధస్సును విజ్ఞానపరచు
నీ విజ్ఞానాన్ని జగతికి తెలిసేలా ఆత్మ జ్ఞానం చెందవా
విశ్వమున నీవే కదా విశ్వ జీవులలో
ప్రతి జీవిలోని విజ్ఞానాన్ని నీ మేధస్సులోనే గ్రహించలేవా
ప్రతి అణువు జీవిత విజ్ఞానాన్ని మహాత్మగా తెలుసుకో
ఏకాగ్రతతో ధ్యానిస్తూ దివ్య విజ్ఞానాన్ని మేధస్సున గ్రహించు
ఆలోచనలు ఎక్కడ దాగిన అన్వేషించి
నా మేధస్సులో లేకున్నా విశ్వ రహస్యాల భేతాళ నిధినే కదలిస్తా
మర్మ ధ్యాసలో మర మనిషికైనా తెలియకుండా మర్మ కాలమున అన్వేషిస్తా
ఆశ్చర్యకర ఆలోచనలు మేధస్సును వనికిస్తున్నా అరచేతి రేఖలలో దాచుకుంటా
విశ్వ విజ్ఞానం తెలియకుండా జీవిస్తే విశ్వమే అజ్ఞానమవుతుందని నా అన్వేషణ
ఆలోచనగా ఆలోచననే గమనిస్తే
ఆలోచనను ఆలోచనగా విజ్ఞానంతో ఆలోచిస్తే ఆలోచనల విషయార్థం తెలియును
విజ్ఞాన విషయార్థాలను సూక్ష్మంగా గమనిస్తే ఆలోచనల భావాలు తెలియును
ఆలోచనల భావాలలో ఉద్దేశ లక్షణాలను విజ్ఞానంగా గ్రహించి కార్యాన్ని సాగించాలి
యుగాలుగా జీవిస్తున్నా కరుణ భావన
ఎన్నో జన్మలుగా ఎనో రకాల జీవులుగా జన్మించినా నేటికి ఆత్మ విజ్ఞానం లేదే
ఎన్నో జన్మలతో ఆత్మ విజ్ఞానం లేక ఎన్నో జీవులుగా కర్మతోనే జీవించాము
కర్మ భావాలను తొలగించుకొనుటకైనా నేటి జన్మలో ఆత్మ విజ్ఞానం చెందాలి
ఆత్మ విజ్ఞానంతో ఆధ్యాత్మ కరుణ భావాలను మేధస్సున గ్రహించి జీవిద్దాము
కరుణ భావాలతో కలి యుగాన్ని ఆత్మ జ్ఞాన కరుణా యుగంగా మార్చుకుందాం
మనిషిలో మనిషిగా మాటలతోనే
ఆత్మలో ఆత్మగా విశ్వమున పరమాత్మగా సాగదా నీ జీవితం
జీవించే మనిషికి మేధస్సున్నది విజ్ఞాన బాటలో నడవడమే
నడిచే ఆత్మకు ప్రయాణం విశ్వాన్ని చేరే గమ్యమేనని తెలుసుకో
మీ మరణంతో ఆత్మ నాలోనే
విశ్వమున ఆత్మలన్నీ నాలోనే కలిసిపోతాయి
ఆత్మ పరమాత్మ భావానికి అర్థం మహా కలయికయే
పరమార్థాన్ని గ్రహించినవారికి పరమాత్మలోనే స్థానం
మరలా నేనే జన్మిస్తా మరణించినా
జననం నాదే మరణం నాదే జీవితం నాదే
రూపం వేరైనా వివిధ భావాలతో జీవిస్తున్నా
నాకు నేనే భావాలను పంచుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నా
ఓ విశ్వమా నేను నీతోనే నీలా
ఆలోచనలతో జీవితాన్ని సాగించలేక పోతున్నాను
భావాలతో నీలా విశ్వ తత్వాలను గ్రహిస్తూ ఉంటాను
విశ్వ భావాలతో విశ్వ తత్వాల విజ్ఞాన మేధస్సుతో జీవిస్తాను
కాలమే విశ్వాన్ని భారంగా ఓర్చుకొని
క్షణమైనా ఆలస్యం లేక పగలు రాత్రిని ప్రతి రోజు దాటిస్తున్నది
సూర్య చంద్రులను గుర్తుగా కదిలిస్తూ తన సత్తాను చాటుకుంటుంది
ఎంతటి మేధావైనా కాలాన్ని ప్రశ్నించలేకున్నట్లు పని చేస్తున్నది
తన కష్టం తనకే తన జీవితం తనకే ఐనా ఎన్నో సృష్టించింది
కాలంతో ప్రయాణిస్తే ఎన్ని ఎలా తెలుపగలనో విశ్వ మేధస్సుకే తెలుసు
కాలం మొదలైన భావన క్షణం నా
ఆనాటి ధ్యాస నేటికి మర్మముగా భావనను కూడా దాచాను
శూన్యాన్ని చేరుకున్నా మర్మ రహస్యం భావన లేక తెలియకున్నది
ధ్యాన ధ్యాసలోనే ఆ భావన నాలో చేరి కాల భావన నేనేనని
కాలము లేక విశ్వము ఏమగునో
మేధస్సుకు కొంతైన ఆలోచించుటకు తెలిసిందా
ఊహా గానంతో అర్థాన్ని అణువంతగానైనా గ్రహించావా
అర్థాన్ని తెలుసుకోగలిగితే విశ్వ విజ్ఞానం నీలోనే
విశ్వమున కరుణ రూపం మదర్
విశ్వమున శాంతి రూపం గాంధీయే
విశ్వమున మన రూపం దేనిని చూపునో అద్దానికైనా తెలియునా
విశ్వమున ఆత్మ ఐనా మన రూపాన్ని చూసేనా ఆలోచించవా
విశ్వమున విజ్ఞాన రూపమైన మనదయ్యేందుకు ధ్యానించవా
ఎన్ని మహా రూపాలను ఒకే సారి
విశ్వ బ్రంహాండాన్ని ఒకే సారి తిలకించినా కంటికి మిక్కిలి సూక్ష్మముగానే
సూది మొన చూసినా కంటిలో మనం గుర్తించలేని అణు సూక్ష్మముగానే
ఎలాంటి యంత్ర పరికరములతో పరిశోధించి చూసినా కనబడని సూక్ష్మ రూపాలెన్నో
కాంతిలోని అణు భావ స్వభావాలు కూడా కంటిలో సూక్ష్మంగా చొచ్చుకొని ఉంటాయి
సృష్టిలో నా భావమే సూక్ష్మమైనది మాహా రూపమైనది అందుకే అన్నీ నా కంటిలోనే
నా కంటిలో అనంత విశ్వ బ్రంహాండాలు కాంతి రూప స్వభావాలు చొచ్చుకొని ఉన్నాయి
కనిపిస్తున్నది నిజమే కాదు
శ్వాసతో పర ధ్యాసలో గమనిస్తూ గ్రహించినదే యదార్థము
కాల కార్య భూత విజ్ఞానం లేక గ్రహించినది యదార్థం కాదు
వర్తమానంలో గ్రహించిన విజ్ఞానానికి భూత కార్య విషయార్థం తెలియాలి
యదార్థం విషయమే గాని సంపూర్ణ కార్య విషయార్థం కాదని గ్రహించు
మీ శ్వాసలోనే ప్రతి జీవి శ్వాసను
ప్రతి జీవి రూపాన్ని శ్వాసతో కీలకంగా గమనించి చూడగలరా
శ్వాసలోని ఆత్మ భావాలను గమనించి విశ్వ రూపాలను గ్రహించు
ప్రతి అణువు నీ శ్వాసలో విశ్వమై జీవిస్తున్నదని ఎరుకతో గ్రహించు
నా భావాలు మీలో కలిగితే
భావాలను గ్రహించుటకు కాలంతో ప్రయాణిస్తూనే ఉండాలి
భావాలకు విశ్వ స్వభావాల అర్థాలతో జీవం పోస్తున్నాను
నాలోని శ్వాస కూడా భావాలలోనే లీనమై ఉండిపోయింది
కాలంతో జీవిస్తున్నంత కాలం నాకు
కాలమే నా శ్వాస భావమై కాలంతోనే నా ప్రయాణం
కాల భావనతో శ్వాస ప్రతి క్షణం జీవిస్తూ ఉంటుంది
క్షణాలుగా కాలం సాగుతున్నట్లు నాలో భావాలు జీవిస్తుంటాయి
నా కవితకు కళ్ళు లేకున్నా విజ్ఞాన
చూడలేకున్నా ఆనంద భాష్పాల భావమే ఉన్నది
మాటలాడకున్నా పదాలకు అర్థాలనే తెలుపుతున్నది
శ్వాస లేకున్నా జీవమై విజ్ఞానంతో జీవిస్తున్నది
అక్షరమే ఆకాశ రూపం ఇక్కడ ఈనాటి ఏనాటిదో
మేధస్సుకు ఆలోచనను కలిగించే విశ్వ
భావనగా మనలోనే మేధస్సు ఆలోచించినా దాని తత్త్వమేది
జీవుల మేధస్సులలోని సహజత్వమైతే జీవించుటకు భావనయే
భావనను మనమే సృష్టించుకుని ఆలోచనగా ఎదుగుతున్నాము
భావన కలగడమే శరీర సూక్ష్మ ప్రక్రియ జీవన తత్వ శ్వాస స్వభావమే
శ్వాస భావనయే కనుక భావాలకు అర్థమే మేధస్సు అదే జీవనం
విశ్వమున ఎక్కడున్నా నా భావాలను
శ్వాసపై గమనం ఉన్నంతవరకు నా భావాలకు స్వభావ అర్థాలు తెలుస్తూనే ఉంటాయి -
విశ్వమున మీరు ఎంత కాంతి తత్వాన్ని చూడగలిగితే మీలో అంతటి విజ్ఞానం ప్రకాశిస్తుంది -
విశ్వ ప్రకాశములు మెరిసే రూపలలోనే ఉంటాయి కనుక వాటినే ఆకాశాన తిలకించండి -
ఓం కార నాదాన్ని మౌనంతో
అంతర్భాగాన శ్వాస విశ్వంతో ఏకమై లీనమైపోవునే
నీ ధ్యాస విశ్వమున ఏకమై ధ్యానమే ఆరంభమగునూ
ధ్యానమున నీలో విశ్వ శక్తి మేధస్సున ప్రవేశించునే
మేధస్సులోని భావాలతో నీ శరీరం కాంతి స్వరూపమే
కాంతి భావాలతో నీ శిరస్సుపై నక్షత్ర కమలమే ఉదయించును
కమలమున దాగిన విజ్ఞానమే విశ్వ చైతన్య పరిపూర్ణము
ప్రతి జీవి ధ్యానమే విశ్వ చైతన్య సంపూర్ణ విజయము
నేటితో రేపటి సమాచారం
రేపటితో నిన్నటి సమాచారం మొదలవుతుంది
సమస్యలను అర్థానికి భిన్నంగా వివరిచుకుంటూ పొతే విషయమే అర్థం కాదు
ప్రతి సమస్యను అర్థవంతంగా పరిష్కారించుకుంటూ పొతే ఏ రోజు సమాచారం ఆ రోజుదే
Sunday, August 29, 2010
ఆనాడు తెలియదురా మనిషికి జ్ఞానం
తనకు తాను ఎదుగుటలో కొంత నేర్చేనురా
తనకు తెలిసిన జ్ఞానమే తప్ప మరో మనిసి జ్ఞానం తెలియకపోయే
భావాలతో బహు చేష్టలతో తెలుసుకున్నాడు కొంత మరో మనిషి విజ్ఞానం
జీవించుటలో భాషతో ఎందరి విజ్ఞానమే తెలుసుకొని తన జ్ఞానం తెలిపాడు
ఒకరి జ్ఞానం ఒకరితో మరెందరితో పంచుకుంటూనే విశ్వవిజ్ఞానం నేర్చెదరు
ప్రతి జీవి రూపము మానవ
మానవ రూపానికి ఉన్న విశిష్టతను గమనిస్తేనే ప్రతి జీవి రూపము నీలో
రూపముతో పాటు ప్రతి జీవి భావనలన్నీ మానవ రూపంలో దాగున్నాయి
భావాలతో బహు జీవితాల చరిత్రను గమనిస్తే మనలో విశ్వమే దాగుంది
వంద సంవత్సరాలు పూర్తైనా విశ్వ
విశ్వ విజ్ఞానం తెలియని విధంగా తెలుసుకోలేనంతగా జీవితంలో అవకాశం ఎప్పుడూ లభించలేదా
నీలో సత్య గుణ కాల భావన ఎరుకతో లేనందువల్ల విశ్వ విజ్ఞానాన్ని గ్రహించలేక ఉండవచ్చు
ఓ దివ్య భావన నీలో ఉంటే విశ్వ విజ్ఞానం నీ మేధస్సున వంద సంవత్సరాలకైనా చేరుతుంది
విశ్వాన్ని భావాలతో గ్రహించలేనప్పుడే మనలో విశ్వ గుణ భావ ఆత్మ తత్వాలు అరిగిపోతాయి
జీవితంలో జరిగే కార్యాలను సూక్ష్మంగా
మనకు తెలిసే విజ్ఞాన పరిశీలనలో సూక్ష్మ అన్వేషణ ఉంటేనే గమన విజ్ఞానం
గమన విజ్ఞానంతోనే శ్వాసను పరిశీలిస్తే విశ్వ విజ్ఞానం సులువుగా తెలియును
శ్వాస భాషలో మౌన విజ్ఞానం విశ్వ భాషలోని పరమార్థాన్ని మర్మగా తెలుపును
నేను తెలిపే భావాలలో ప్రతి పదాన్ని
అర్థానికి అవగాహన అనుభవం విశ్వ విజ్ఞానం చాలా అవసరం
అవగాహానలో పర్యవేక్షణ అర్థంలో సద్భావన గుణం ముఖ్యమే
ఎక్కడో కలిగిన సందేహానికి ఇక్కడ లేదా మరెక్కడో ఉత్తరం లభిస్తుంది
ఇష్ట పూర్వకంగా లేని పనులను
ఆశయాలు సమస్యలతో ఉన్నా సాధనతో సాధించుకుంటూ ఇష్ట పూర్వకంగా చేయవచ్చు -
ఎప్పటి ఆశయాలైనా ఎంతటివైనా కార్య దీక్షలో సమన్వ్య సమయ స్పూర్తి ఉంటే సాధ్యమే -
ప్రాశాంతంగా ఉన్నప్పుడు ప్రణాళికను ప్రారంభించు ఉపాయ సాధనతో ముగించుటకు ప్రయత్నించు -
నాలో ఉండే ప్రతి కణము కాంతి
సంపూర్ణ విశ్వ విజ్ఞానంతోనే నాలో కణాలన్నీ కాంతి తత్వమౌతాయి
మహా దివ్య ధ్యానముతో విశ్వమున లీనమైతే ప్రతి అణువు కాంతి భావమే
కాంతి భావాలు ఎప్పటికి విశ్వ లోక అంతరిక్షమునననే జీవిస్తాయి
నేనూ మీలాంటి ఆత్మ రూపాన్నే
ఆలోచించే రీతి గమనం ఆశయాలు అన్వేషణ ఇలా ఎన్నో మీకు భిన్నంగా ఉంటాయి
మేధస్సులో కలిగే ప్రతి ఆలోచన భావాన్ని గమనిస్తూ విశ్వ విజ్ఞాన అర్థాన్ని గ్రహిస్తాను
ప్రతి అణువు స్వభావ రూప తత్వాన్ని విశ్వ భాషతో తెలుసుకుంటూ జీవిస్తున్నాను
నాలో ఆలోచనలు ఎక్కడ నుండి
మేధస్సుకు చేరే ఆలోచనలు నాలో ఉన్నాయా లేదా గాలితో కలుగుతున్నాయా
ఎక్కడి నుండో నాలో గాలి ద్వార ఆత్మ ప్రయాణ అన్వేషణతో కలుగుతున్నాయా
నా మేధస్సే ఆలోచనలను సృష్టిస్తూ విజ్ఞాన అర్థాన్ని మేధస్సులోనే గ్రహిస్తున్నదా
అన్వేషణ లేకుండా ఏ ఆలోచన కలగదని మేధస్సులో ఓ భావన తెలుపుతున్నది
నా భావాలను ఇంకా వివరించుకుంటూ
అతి సూక్ష్మంతో ఆలోచించే భావాలలో విశ్వ విజ్ఞాన రహస్యాలు ఎన్నో ఉన్నాయి
మేధస్సులో నేను అన్వేషించే విశ్వ భావాలకు ఆలోచనలెన్నో రహస్యాలే
విశ్వ విజ్ఞాన భావాలను కీలకంగా వివరించుకుంటూ పొతే రహస్యాలు తెలుస్తూనే ఉంటాయి
మానవుని విశ్వ విజ్ఞానమేరా జగతికి
ఆ మూల విజ్ఞానాన్నే విశ్వమున గ్రహిస్తున్నా
తెలుకోరా నీవే విశ్వమున పరిపూర్ణ ప్రజ్ఞానం
పరిశుద్ధ భావంతో జీవించేందుకేరా విశ్వ విజ్ఞానం
నా మేధస్సులో కల్గుతున్న అనంత
ఆలోచనలలో కలిగే భావాలకు నా మేధస్సులో అర్థాలున్నా ఎవరికి తెలియును
అర్థాలు తెలియుటకైనా నా భావాలను విజ్ఞానంగా మీకు తెలుపుతున్నా
అన్ని భావాలను ఒకే సారి చెప్పలేను కనుక ఇలా కాలంతో తెలుపుతూ ఉన్నా
ఒక్కసారి నా భావాలను మాహా
నేను తెలిపే భావాలు ఎలాంటివో ఎందుకో ఎవరికో ఆలోచించండి
భావాలలోని జ్ఞాన విజ్ఞానాలు ఎలాంటివి ఎలా తెలుపగలుగుతున్నాను
ఎంతటి సూక్ష్మ విషయాలను అర్థమయ్యేలా గ్రహించి వివరిస్తున్నాను
నా కోసమైతే నా మేధస్సులో ఎవరికోసమో ఐతే విశ్వ జీవులకే
మరల ఆలోచించే సమయం రాదు తెలుసుకునే సమయమున్నా అర్థం కాదు
ఎవరు వివరించినా ఏదో సందేహము మీ మేధస్సులో వెంటాడుతూనే ఉంటుంది
కొన్ని వేల కోట్ల సంవత్సరాలు
మరల నేటి విజ్ఞాన జీవిత జన్మ రాదేమోనని ఆలోచనలను మార్చుకుంటున్నా
మహా దివ్య భావాలతో జీవిస్తూ ఎన్నో సంవతరాలుగా ధ్యానించాలని అనుకున్నా
విశ్వమున ఓ ఆత్మ విజ్ఞానిగా జీవిస్తూ పరమాత్మ భావాలతో నిలిచిపోవాలనుకున్నా
ఎప్పటికీ విశ్వ లోకంలోనే జీవించాలని
విశ్వ రూప అద్భుతాలను తిలకిస్తూ జీవించాలని ధ్యానిస్తున్నా
విశ్వ కాల విజ్ఞానాన్ని మేధస్సున సేకరిస్తూ ధ్యానిస్తున్నా
విశ్వమునకు ఓ సూచన కర్తగా అన్ని దిక్కులలో ధ్యానిస్తున్నా
అందరూ క్షేమంగా ఉండాలనే మంచి
విజ్ఞానంతో అందరూ శ్రమిస్తూ చైతన్యం కావాలని భావిస్తారు
ఒకరికి ఒకరు సహాయ కార్యాలతో విజ్ఞానం చెందాలని మహా కార్యాలను నడిపిస్తారు
మనిషిలో అందరూ సమానమనే గుణం కలగాలనే ఎన్నో విజ్ఞాన కార్యాలను నిర్వహిస్తారు
స్నేహ భావాలతో ప్రతి ఒక్కరు జీవించాలనే మహానుభావుల చైతన్య కార్యాలు
ఏ ప్రభూ! విశ్వ జీవులకు ప్రాణాన్ని
రూపాలను మాత్రం వివిధ పరిణామాలలో ఎన్నో సృష్టించావు
భావాలను కూడా వివిధ రకాల విచక్షణాలతో కల్పించావు
ఎన్నిటినో వేరుగా కల్పించి ప్రాణాన్ని మాత్రమే సమానంగా ఇచ్చావు
జీవితకాలాన్ని ఆలోచనల అజ్ఞాన విజ్ఞానాన్ని వివిధ రకాలుగానే ఇచ్చావు
జీవించే విధానంలో స్థానాల ప్రభావాలనూ వివిధ కోణంలోనే కల్పించావు
ఎన్ని వేరైనా ప్రాణముతో అన్నీ జీవరాసులు సమానమేనని తెలుపుతున్నావు
విశ్వ ఖగోళంలో ఎవరు మేధావులు
విశ్వమున జన సంఖ్య అధికమగుటలో ఎందరో మేధావులు తెలియకపోతున్నారు
ఏ మేధావి దేనిని పరిశోధిస్తున్నాడో ఎలాంటి విజ్ఞానాన్ని తెలుపుతున్నాడో తెలియదే
ఎన్నో రంగాలలో సాధించే విజ్ఞానం ఎంతటి అద్భుతమో ఎందరికో తెలియుట లేదు
విశ్వ ఖగోళమున జరిగే మేధావుల విజ్ఞాన అద్భుతాలు దూర దర్శనములలో తెలియును
నా మేధస్సు విశ్వ ఖగోళ విజ్ఞానమై జీవించాలని ఆత్మ భావాలతో విశ్వాన్ని పరిశోధిస్తున్నా
మీలోని అద్భుతాలు ఇంకొకరికి
ఒకరి అద్భుతం మరొకరికి మరో విజ్ఞాన అద్భుతం
ఒకరి విజ్ఞాన ఆలోచనలతో మరొకరికి మరో ఆలోచనలు కలుగుతాయి
మరో ఆలోచనలతో విజ్ఞానం చెందుతూనే అద్భుతాలు సృస్టించగలము
విశ్వమున విజ్ఞానం అద్భుతంగా సాగాలనే మరొకరికి తెలుపుతూ జీవించండి
మీలో వింత విజ్ఞానం ఉంటే నాకు
నాలో ఉన్న విజ్ఞానం మీకు తెలుపుతున్నా
ఒకరి విజ్ఞానంతో మరొకరు మరో విజ్ఞానాన్ని తెలుసుకుంటారు
ఎందరికో తెలిసిన విజ్ఞానంతో ఎందరో విజ్ఞానవంతులు అవుతారు
మహా విజ్ఞానంతో విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చనే నా భావన
అద్భుత సాహాస ఆశ్చర్య మహా సూక్ష్మ విజ్ఞానం వింతయే కదా
ఆధునిక సాంకేతిక విజ్ఞానం వివిధ రంగాలలో ఎన్ని వింతలో
విశ్వమున ప్రతి స్థానమున ఎప్పుడు ఏ విజ్ఞానం కలిగినా నా మేధస్సులో చేరుతుంది
సృష్టిలో ఉన్నంత కాలము మన
మనకు తెలిసినవారు మనకు తెలియని మన గురించి తెలిసినవారు ఆలోచిస్తారు
మన గురించి ఎవరు ఆలోచించినా మంచి అనే భావన చర్చించేలా మనం ఎదగాలి
మన గురించి ఒక్కరు అనర్థంగా మాట్లాడినా మన ద్వారా తప్పు జరిగి ఉంటుంది
ఇంకొకరికి మన తప్పు కనిపించని విధంగా అవకాశం కల్పించకుండా జీవించాలి
విజ్ఞానాన్ని ఉన్నచోటనే అన్వేషించే
యంత్రమునందే ఉన్న చోటనే కొన్నింటిని చూడవచ్చు కొనవచ్చు వినవచ్చు
ఎన్నింటినో అద్భుతాలుగా సాంకేతిక విజ్ఞానంతో యంత్రాలుగా సృష్టిస్తున్నారు
నేటి విజ్ఞానం మాయకు దగ్గరలో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నది
మేధస్సులో ఏ ఆలోచన ఎప్పుడు
ఏ ఆలోచనతో ఎలా జీవిస్తాం ఎన్ని ఆలోచనలను మేధస్సు స్వీకరించును
ఎన్ని ఆలోచనలు అర్థమౌతాయి ఎన్నింటిని శాశ్వితంగా మరచిపోతాం
ఏ ఆలోచన ఏ భావ స్వభావాన్ని మేధస్సుకు ఎలా తెలుపుతుంటుంది
నా మేధస్సులో ఆలోచన చక్రాన్ని ఉత్తేజమునకై భావనతో నిర్మించుకున్నా
ఉత్తేజముతో మేధస్సు యొక్క సామర్థ్యం పెరుగుతూ అపార విజ్ఞానాన్ని సేకరిస్తుంది
నా భావాలు విశ్వ జీవికే విజ్ఞానంగా
విశ్వ విజ్ఞానిగా జీవించే మేధస్సు అంకెలలోనే ఉంటుంది
విశ్వ విజ్ఞానిగా ఎదిగే అవకాశం మహాత్ముల మేధస్సుకే
సంఖ్యలుగా విశ్వ విజ్ఞానులు ఎదగాలని నా భావార్థం
ఎవరిని తక్కువగా ఎప్పుడూ అంచనా
నేడు కాలం అతనికి సహకరించలేక ఆ స్థితిలో ఉన్నాడు
కొంత కాలం గడిచిన తర్వాత నీ కన్నా గొప్ప స్థితిలోనే
ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది
మన స్థితి మన ప్రయత్నాలలో ఉన్నా ఎప్పుడైనా మారవచ్చు
నా వాక్యాలు భావన విజ్ఞానానికి
సూక్ష్మ పరిశీలన గల ఆలోచనలకు స్పూర్తినిస్తాయి
విశ్వ విజ్ఞానానికి ఆదర్శకంగా ఎప్పటికి ఉండిపోతాయి
విశ్వ అర్థాన్ని తెలిసుకొనుటకు పరమార్థాన్ని తెలుపుతాయి
సూది రంధ్రము నుండే విశ్వమంతా
సూక్ష్మ జీవుల నేత్రాలు కూడా విశ్వమంతా చూడగలుగుతాయి
ఓ పరమాణు కణ నేత్రమైనా విశ్వాన్ని తిలకించగలుగుతుంది
నేత్రము లేకున్నా దివ్య విచక్షణ భావన విశ్వాన్ని దర్శించగలదు
ఎక్కడ సరైన జీవితమున్నది ఎవరు
ఎవరికి జీవితమంతా సరిగ్గా జీవించే అవకాశం వచ్చింది
కాలం ఎలాంటి అజ్ఞానాన్ని ఎప్పుడూ కల్పించడం లేదా
కాల ప్రభావాలు జీవితానికి అడ్డంకులు కావటం లేదా
విజ్ఞానంగా జీవించాలనుకున్నా ఏదో విధంగా ఆటంకమే
అజ్ఞానం కలిగే మేధస్సుతో నేను జీవించలేకపోతున్నా
విశ్వ జీవులలో నేను ఎక్కడ నా
నన్ను జీవింపజేయుటలో పరమార్థం ఏమిటి
జీవితం సరిలేకున్నా భావాలతో జీవించగలనా
జీవనం సరికాకున్నా భావాలకే అంకితమౌతానా
కొత్త భావాలు కలిగే వరకు పాత
కొత్త భావాలతో పాత భావాలను తాత్కాలికంగా మరచిపోతున్నాము
కొత్త భావాలు మరో కొత్త భావాలతో పాత భావాలుగా మారిపోతాయి
కొత్త భావాలు పాత భావాలుగా మారిపోతే మనలో ఇంతకు ముందు పాత భావాలు గుర్తొస్తాయి -
మనిషి ఆలోచనలలో కొత్త భావాలు త్వరగా కలగకపోతే పాత భావాలే గుర్తొచ్చి వేదిస్తుంటాయి -
ఏ భావం కలిగినా మనిషి మరణించే వరకు జీవించాలి కనుక అద్భుతాలనే తిలకిస్తూ సాగాలి -
జీవిత అద్భుతాలకై కొత్తగా విశ్వం నలుమూలల మహా భావాలతో ప్రయాణిస్తూ అన్వేషించండి -
కాలమా! తప్పు జరగాడానికి ముందు
తప్పు జరుగుతుందని తెలిసేలోగా సరిదేద్దేందుకు నాకు అవకాశం లేకుండా కార్యం జరిగిపోతున్నది -
నా ద్వారా సృష్టిలో తప్పులు జరగాలని కర్మ సిద్ధాంతము తెలిపితే సగర్వంగా జరిగిపోవాలనుకుంటా -
తప్పు జరిగేందుకు అవకాశమున్నా సరిదిద్దుకునేందుకు నాకు అవకాశం లేదనే ఆలోచిస్తూనే ఉన్నా -
తప్పు జరిగేటప్పుడు గ్రహించే క్షణ కాల మేధస్సు ఉంది కాని జరగకుండా ఆపే శక్తి నాలో లేదెందుకో -
Saturday, August 28, 2010
నా మరణం కూడా మహా అధ్బుత
శ్వాస ఆగిన తర్వాత మేధస్సుకు క్షణమైనా చాలు భావాన్ని తెలుసుకొనుటకు
ఆ క్షణ భావనతోనే విశ్వమున ప్రతి జీవి మరణాన్ని తిలకిస్తూ నిలిచిపోతాను
మరణ భావన కూడా నాలో ఉందని విశ్వమున మహా అద్భుత విషయమే
విశ్వ మేధస్సును విజ్ఞానముకై
విశ్వ రహస్యాల సారాంశాన్ని తెలుసుకోండి
నేటి సమస్యలకు పరిష్కారాన్ని తెలుపగలదా
విశ్వాన్ని ఎలా గొప్పగా తీర్చి దిద్దుకోవాలి
విశ్వాన్ని ప్రశాంతంగా ఎలా ఉంచాలో ఆలోచించండి
విశ్వమున ఏదో తెలియని మేధస్సు
రహస్య మర్మాన్ని మానవుల నుండి గ్రహిస్తూనే ఉంది
విజ్ఞాన భావాలను గ్రహించి కాల మార్పులు చేస్తున్నది
ప్రతి జీవి మేధస్సుకు ఆలోచన భావతత్వాలను కలిగిస్తున్నది
ప్రతి అణువు నుండి భావ స్వభావాలను తెలుసుకుంటూనే ఉంటుంది
నా మేధస్సు విశ్వ మేధస్సు నుండి ఎన్నో భావాలను గ్రహిస్తున్నదేమో
ఎవరికి తెలియని గుణములు నాలో
ప్రతి అణువు కణాలలో దాగిన సూక్ష్మ భావాలు నాలో ఎన్నున్నాయో
ప్రతి క్షణం ప్రతి కణంలో కలిగే కాల స్పర్శ జీవన భావాలు అనేకమే
ప్రతి స్పర్శలో కలిగే సూక్ష్మ గుణ భావాలు ఎన్నో తెలియని విధమే
అధిక జన సంఖ్యలో మంచి వారెవరో
ఎవరికి సహాయం చేయాలో తోచుటకు వీలుకాదు
ఎన్నో సంవత్సరాలు కలిసే ఉన్న మోసగిస్తున్నారు
జన సంఖ్యతో విజ్ఞానానికి సహాయానికి విలువ లేదు
మీ రూపం కలవారు మీ యందే
మీ రూప పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి
చూసేందుకు సోదరులవలె కనిపిస్తారు
ఎక్కడో జన్మించిన వృత్తి రిత్యా కలుస్తారు
ప్రయాణమున కూడా ఎందరో కనిపిస్తూనే
జన సంఖ్య కారణమున ఎన్నో ఆశ్చర్యములు
నిత్యం సాగిపోవాలనే కాలంతో
భావాలను కాలంతో ఏకం చేసి శ్వాసిస్తున్నా
నా రూప పంచ భూతాలను సృష్టికే అప్పగించా
విశ్వమున కనబడని కాలంతో నే సాగుతున్నా
విశ్వ భూతములు నావే విశ్వ
విశ్వ భూతములే నాలో పంచ భూతాలుగా
గాలి నీరు అగ్ని స్థలం భూమి నాలో ఉన్నాయి
ప్రతీది నాలో ఉన్న గుణముతోనే సృష్టించబడింది
ప్రతి రూప భావ స్వభావాలు నాలో ఉన్న గుణాలే
అజ్ఞాన విజ్ఞానములు కూడా నన్నే గోచరిస్తున్నాయి
కనిపించనివి కలగా కలిగేవి ఆలోచనలన్నీ నావే
కాలముగా ఆరంభమై ఎంతవరకో తెలియని విధంగా సాగుతున్నా
పంచ భూతములు లేకున్నను కాలముగా నేనెప్పుడూ ఉంటాను
విశ్వకవి చేతిలో కలము లేకున్నా
కాలము ఆలోచనను కలిగించాలే గాని కవిత అదే వస్తూ ఉంటుంది
ఓ విషయార్థాన్ని సమగ్రముగా తెలుపుటలోనే కవి కవిత్వ భావన
ఆలోచనతో విషయాన్ని అర్థంగా పరిశీలించి వ్రాయగలిగేవారే విశ్వకవి
విశ్వమున ఎన్ని భాషలు వెలిసినా
భాష వివిధ ప్రాంతాల మనస్థత్వాల పరంపర వేద భావాల స్వరాలతో ఏర్పడుతుంది
స్వరాలను పదాలతో కొన్నింటిని తెలిపేందుకు గుర్తించేందుకు వాడుకతో కలిగేదే భాష
పదాలను ఓ గుర్తింపుగా నిర్ణయించి వాక్యాలుగా అర్థాన్ని గ్రహిస్తున్నప్పుడే భాష ప్రదం
ప్రతి దానిని అర్థాలుగా అక్షరాలతో తెలిపినప్పుడే సంపూర్ణ భాషగా నిర్మితమవుతుంది
అక్షరాలలో ఉన్న ఆకారాలే పలికేందుకు రాగాలై లిపిగా భాషతో మారుతూ వచ్చింది
ఓ ఆలోచనను స్వీకరిస్తున్నప్పుడు
ఏకాగ్రత చెదిరిపోతే ఆలోచన యొక్క సంపూర్ణ విజ్ఞానాన్ని మరల పొందలేవు
ఆలోచనలో విజ్ఞానంగా దాగిన భావ స్వభావాలు నీ జీవితాన్నే మార్చగలవేమో
ఆలోచనను పరిపూర్ణ ప్రజ్ఞానంతో స్వీకరించేలా ఏకాగ్రత ధార కలిగి ఉండాలి
తక్కువ సమయంలో ఎక్కువగా గ్రహించే విజ్ఞాన ఏకాగ్రత మేధస్సుకే కలగాలి
విశ్వము నుండి ఆలోచనలను
గ్రహించుటలో ఇంకా అజ్ఞానమేగాని విజ్ఞానం కలగటంలేదే
తాత్కాలిక పద్ధతులే జీవితానికి అవసరమనే భావిస్తున్నారు
శాశ్విత విజ్ఞాన ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నారు
శాంతి తత్వం మేధ మనస్సులో కలిగే వరకు అజ్ఞానమే
అజ్ఞానం తొలగిపోవాలంటే ధ్యాన సాధన చాలా అవసరమే
విశ్వ కవిగా జీవించడంకంటే విశ్వ
'విశ్వ శాంతి' గా గాంధి 'విశ్వ సేవ' గా తెరెసా విశ్వానికి విధాతలే
విశ్వంలో ఆత్మ రూపం కనిపించే విధంగా విశ్వ విధాతలు జీవించారు
విశ్వ తత్వాలతోనే జీవితాన్ని శాంతి సేవకై కొనసాగించి నిలిచిపోయారు
విశ్వాత్మ గలవారే ఇలా అరుదుగా ప్రజలను మేల్కోల్పి వెళ్ళిపోతారు
విజ్ఞాని విశ్వ కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే విశ్వ విధాతయే
విశ్వ భీజమే విశ్వ వృక్షమై విశ్వమంతా
ఎన్నో అద్భుత రూపాల దివ్య స్వభావాలతో విశాలంగా నిర్మితమైనది
లోకాలుగా బ్రంహాండ స్వరూపమై ఎన్నో వర్ణాలతో సృష్టించబడింది
విశ్వమంతా ఒకేసారి కనిపించే విధంగా నేత్రానికే చాలకపోతున్నది
ఈ పాట ఏనాటిదో మాట తెలుపలేక
పాత పాటగా పాడుతున్నా పలుకులో కొత్తగా వినిపిస్తున్నది
చెవిని తాకితే తేలిపోయే స్వరంతో రాగమై మేల్కోల్పుతున్నది
భావాలతో స్వరాగాల స్వభావాలను తెలుపుతూనే ఉన్నది
సంగీతంలో భావాలకు స్వర్గమే శ్వాసలో తేలిపోదా
రాగాలలో స్వభావాలకు స్వప్నాలే మేధస్సులో చేరిపోవా
జీవితాన్ని హాయిగా మార్చుకో శ్రమిస్తున్నా సంతోషం పాటలోనే
ఎన్ని విధాల ఆలోచించినా జీవితాన్ని ఆనందంతో సాగించడమే
ఆరోగ్యాన్ని కలిగించే సంగీతం నా పాటలో రాగమై దాగి ఉన్నది
అన్వేషించే బాట తెలిస్తే గతమంతా క్షణమే గమ్యమే మరో క్షణం
విశ్వ అణువులలో అణువుగా నేను
అణువుగా సూక్ష్మమై ఉన్నా మహా రూపాలు నాతోనే
అణువుగానే ఉన్నా విజ్ఞానంగా మహా విశ్వ జ్ఞానినే
మహా రూపంగా ఎదిగినా అణువుగానే ఒదిగి ఉంటా
విశ్వ భాషలో మౌనమై విశ్వ తత్వాల
విశ్వ భాషతో విశ్వ విజ్ఞాన వేద సారాంశాన్ని అవగాహన చేస్తున్నా
విశ్వమందే జీవిస్తూ మౌనమే వహిస్తూ ఆకాశమునే తిలకిస్తున్నా
విశ్వ రూపముల దివ్య కాంతులను సూక్ష్మ జ్ఞానంతో పరిశీలిస్తున్నా
విశ్వ గ్రహాలనే కాక అత్యంత రూపములను ఎన్నింటినో గమనిస్తున్నా
విశ్వ భాషతో అన్వేషించే నా మేధస్సు మహా ధ్యాసలో ఆలోచించునా
మేధస్సులో మార్పు కలిగినా మనిషి
విజ్ఞానం తెలిసినా అజ్ఞాన కార్యాలు చేస్తూనే మార్పులేక జీవిస్తున్నాము
మార్పు కలగాలని అనుకుంటే చాలదు నడవడిలో ఆచరణ పెట్టగలగాలి
మనలో మన మార్పు కోసం జీవించేందుకు ధ్యాస సాదన కూడా అవసరమే
23 ఆగస్టు 2010 న నేను చూసిన
సూర్యుడు అస్తమించే సమయాన 20 గజాల పొడవు 6 అంగుళాల వెడల్పుతో
మేఘాల మధ్యమున సూర్య బింభము ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించింది
ఇలాంటివి ఆకాశాన నిజ జీవితంలోనే కాక నా నిద్రలో కలిగే అద్భుతాలు ఎన్నో
ఎన్ని పూజలు చేసినా ఆచారాలు
కాలం ఎప్పుడూ మేధస్సును మరిపించి మరో ధ్యాసలో అజ్ఞానాన్ని కలిగించేలా ప్రతి క్షణం వెంబడిస్తూనే ఉంటుంది -
ప్రతి కార్యానికి సూటిగా చేసే విజ్ఞాన ఆలోచనను కలిగించలేక మరో విధంగా చేసేలా అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది -
అజ్ఞానంతో అనుభవాన్ని తెలుసుకొని సూటిగా చేసే కార్య కారణ విషయాన్ని తెలుసుకొని విజ్ఞానాన్ని గ్రహిస్తాము -
ఒక కార్యాన్ని సూటిగా చేసే కార్య కారణ విషయం తెలిసిన తర్వాత మిగిలిన కార్యాలను కూడా సూటిగా చేయగలగాలి -
ప్రతి కార్యంలో దాగిన కార్య కారణ విషయాన్ని గ్రహిస్తూ పొతే పొరపాట్లు జరగక అడ్డంకులు కలగకుండా పోతాయి -
ప్రతి కార్యాన్ని సూటిగా చేయగలగాలంటే మేధస్సులో మహా ఏకాగ్రత ఉత్తేజం భవిష్య విజ్ఞాన ప్రణాళిక దాగి ఉండాలి -
మేధస్సుకు అన్నీ సాధ్యం కావు కనుక అజ్ఞానం జన్మించినప్పటి నుండి మరణించేవరకు కలుగుతూనే ఉంటుంది -
మన ప్రయత్నం మనం చేస్తూ వీలైన సమస్యలను తగ్గిస్తూ విజ్ఞానంగా ఎరుకతో కార్యాలను చేసుకుంటూ సాగాలి -
కాల ప్రభావాలు కూడా సూటిగా చేసే కార్యాలకు ఎన్నో అడ్డంకులను అప్పుడప్పుడు కలిగిస్తూనే ఉంటాయి -
నిరుత్సాహం లేక జీవితాన్ని విజ్ఞానంగా ముందుకు సాగిస్తూ మరొకరికి ఆదర్శంగా దారి చూపిస్తూ ఉండాలి -
అనవసరమైన కార్యాలను కోరికలను ఆలోచనలను మానుకుంటేనే సమస్యలు తగ్గి విజ్ఞానం పెరుగుతూ వస్తుంది -
నా మరణాన్ని కొన్ని వేల కోట్ల
జన్మించిన భావం తెలియలేక మరణించే భావం తెలియలేక నే జీవిస్తున్నానేమో
జన్మించిన భావాలను గతంలో తెలియకుండానే మరో ధ్యాసలో వదిలి ఎదిగాను
మరణించే భావాలైనా తెలుసుకోవాలనే మహా ధ్యాసతో ఆలోచిస్తూనే ఉన్నాను
ప్రతిరోజు మౌనంతో మూడు నిమిషాలు
నీలో విశ్వ విజ్ఞాన ఆలోచన భావాలు ఉద్భవించి నీ జీవితాన్ని ఆధ్యాత్మకంగా మార్చేస్తాయి -
నీలో అపారమైన ఏకాగ్రతతో పాటు విషయ అంశాన్ని పరీక్షించే అవగాహాన కలుగుతుంది -
నీ ప్రవర్తనలో మార్పు కలిగి నీ విజ్ఞానాన్ని మరొకరికి తెలిపేలా నీలో అపార జ్ఞానం చేరుతుంది -
Friday, August 27, 2010
Change the Society for
Economical changes is not an better development for society -
Behavior is grace to stand in front of society for development -
Behavior never loss what we promise for society and how we rectify -
There is no proper plan to develop the society in all events -
When ever we know the sequence of steps followed by the reason of event to start exact then only we survive -
విశ్వ భూమి నీదైనందుకే విశ్వ శక్తితో
శ్వాసయే నీకు విశ్వ శక్తిగా నీలోనే నీతో ఉంటుంది
శ్వాసతో జీవించే నీవు విశ్వమున విశ్వ విధాతవే
మరణించినా నీవు విశ్వ భూమిలోనే కలిసిపోతావు
జ్ఞానం తెలిపినవాడు బ్రంహా
జ్ఞానం తెలిసినా సంధర్భమున తెలుపకపోతే అజ్ఞాని
జ్ఞానం తెలుసుకోవటమే తప్ప తెలుపకపోతే అజ్ఞానలోహితుడు
జ్ఞానాన్ని ఎవరికైనా పంచేవాడే విజ్ఞాన విశ్వ బ్రంహా
ఒకరికి కలిగిన జ్ఞానం మరొకరితో
మరొకరి జ్ఞానంతోపాటు తన జ్ఞానం కూడా సాగుతున్నది
జ్ఞానం విజ్ఞానంగా ఎవరెవరి విజ్ఞానమో సాగుతూనే ఉన్నది
ఎవరి విజ్ఞానం ఎలా ఎందరితో సాగుతున్నదో తెలియుటలేదు
ఎన్నో అనంత విశ్వ భావాలున్నా
ఎన్నో మహానుభావుల జీవితాలను చూశాను ఐనా ఇంకా నాలో భాద్యతలు వీడకున్నాయి -
విజ్ఞాన ఆలోచనలున్నా నా మేధస్సును నిర్ణయించుకోలేక సతమతమవుతూనే ఉన్నాను -
వృత్తి రిత్యా కొనసాగుతూనే ఉన్నాను గాని సమాజం వైపు ఇంకా ప్రయాణించలేక పోతున్నా -
విశ్వ భావాలు ఉన్నంత మాత్రం
విశ్వ భావాలతో ప్రపంచాన్ని తీర్చి దిద్దేందుకు సమాజంలో శాంతి సేవ చేయగలగాలి -
సేవ చేయలేని ప్రసంగాలు ప్రచారణలు ప్రజలకై శాంతి తత్వాన్ని నీవు నేలకోల్పలేవు -
ఓ గొప్ప ఆలోచనతో శాంతి సేవకై సమాజంలో సమస్యలను తొలగించడానికి ముందుకు రావాలి -
రూపములలో కన్నా విశ్వ భావాల
విశ్వ భావాలను స్వీకరించిన వారే ప్రపంచాన్ని తీర్చిదిద్దగలరు
విశ్వ భావాలలోని విషయాలు ఆధ్యాత్మ విజ్ఞాన ఆలోచనలు
ఆలోచనలను అర్థం చేసుకున్నవారు ప్రపంచానికి సేవ చేస్తారు
ఒక్క సారి విశ్వ భావ ఆలోచనను గ్రహించిన తర్వాత కట్టుబాట్లతో నడుచుకోవడం మహా దివ్యత్వం -
కట్టుబాట్లతో నడిచినవారు గాంధి, మదర్ తెరెసా మొదలైనవారు చాలా అరుదుగా జన్మిస్తారు -
విశ్వమును జయించేది ప్రశాంతత సేవా ఇవే ముఖ్యమైన మహా శక్తి గల విజయ స్థూపములు -
ఏక సంతాగ్రహి ఐనా ఓ సారి గ్రహించిన విజ్ఞాన ఆలోచనకు కట్టుబడి ఉండటమే ఆధ్యాత్మ లక్షణం -
సమయం లేనప్పుడే కొన్ని వేల లక్షల
ఆలోచనలన్నింటిని ఓ విజ్ఞాన వాక్యముతో మేధస్సున మరోధ్యాసలో దాచుకో
ఓ వాక్యాన్ని కోట్ల ఆలోచనలతో మహా గ్రంథంగా క్రమ సిద్ధాంతముగా లిఖించు
కోట్ల ఆలోచనలు మహా దివ్య శాస్త్ర వాఖ్యాలుగా గ్రంథములో నిలిచిపోతాయి
మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే
మరల ఎప్పుడు ఆలోచించినా దాని అర్థం మారకూడదు
ఓ కార్యమైనా విషయమైనా ప్రశాంతంగా పరిష్కారించు
మౌనం ఓ విజ్ఞాన ఏకాగ్రత గల అన్వేషణ విశ్వ కేంద్రం
ఒకరు తెలిపిన మాటలను అర్థంగా
వారు తెలిపిన ఉద్దేశ్యాలు వేరుగా ఉండవచ్చు నీకు మరో విధంగా అర్థం కావచ్చు
అర్థం కానివే ఎప్పుడూ తెలుపుకుంటూపొతే నీలో కొత్త విజ్ఞానం ఏనాటికీ కలగదు
కొత్త విజ్ఞానంకై నీ మేధస్సును విశ్వంలో అన్వేషించేలా ఆలోచనలను మార్చుకో
ఓ విశ్వ విధాతగా నీవు మహాత్మగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించు
Don't change the entire
The world is having natural energy, but decreases day by day -
There is no plan to construct the buildings, companies such a long time -
I have plan to make the world as campus for permanent final solution (Dead end) -
So many things are going into wrong way in the world on different places -
The artificial changes to decrease the lifetime of living things -
For Universal strategy and procedure please contact me -
If don't met me for any kind of universal information please do meditation -
The way of thoughts you can't understand for solution observe the nature as nature -
You can find the inner knowledge for final solutions -
నీలో ఉన్న ప్రాణం నీది కాదని శ్వాసగా
విశ్వం నీలో నుండి తొలగిపోయిందంటే విశ్వంలో నీకు స్థానం లేదనే
విశ్వం నీలోనే జీవమై ఉండాలంటే శ్వాసగా ఉన్న విశ్వాన్నే గమనించు
శ్వాసే నిన్ను విశ్వంలో ఉంచేలా ధ్యానించాలని విజ్ఞానాన్ని గ్రహించు
విశ్వమున ప్రతి రూపము నాకు
నేత్రమున విశాలమైనా మేధస్సులో అణువుగానే తోస్తున్నది
అణువు కూడా పరమాణువుగా మేధస్సులో విజ్ఞానమైనది
ప్రతి రూపము అణువుల సముదాయమైనా అంతా అణువుగానే
విజ్ఞానముకై ప్రతి రూపాన్ని అణువణువునా అణువుగా పర్యవేక్షిస్తున్నా
అణువు యందలి దాగిన జ్ఞానము సూక్ష్మ అణువుగా విజ్ఞానం కలిగినది
అణువుగా తెలిసిన జ్ఞానమే విశ్వ విజ్ఞానమై అణు సిద్ధాంతాన్ని తెలుపుతుంది
ఆకలి వేసినా దాహం కలిగినా విజ్ఞాన
మేధస్సులో మర్మ ఆలోచనలతో విశ్వాన్ని దిక్సూచితో అన్వేషిస్తున్నా
ఏ దిక్కున ఏ స్థానమున ఎలా ఆకలి దాహాలు కలిగినా భావాలతోనే
మేధస్సును మహా దివ్య స్వభావాలతో ఆలోచింప జేయాలనుకుంటున్నా
విశ్వమే శ్వాసగా నాలో ఉన్నందుకు
విశ్వంలో జరిగే అద్భుత ఆకాశ ప్రకృతి భావ స్వభావాలు నాకు దర్శనమిస్తున్నాయి -
నిద్రించుటలో బ్రంహాండాన్ని తిలకించేలా నా మేధస్సులో ఆలోచనలు అన్వేషిస్తాయి -
బ్రంహాండ విజ్ఞానం నా విశ్వ మేధస్సులో అణువుగా నిక్షిప్తమై కాలంతో సంచరిస్తున్నది -
శ్వాసతోనే విజయాలను సాధించు
జీవితం మర్మమే నీలోని శ్వాస రహస్యమే విశ్వమున నీ జీవనమే
శ్వాసలేని నీవు విశ్వమున లేవని విజయాలు ఎవరికో మిగిలాయి
విజయాల కోసమే విశ్వమున జీవించుటకు శ్వాసనే నీలో గమనించు
Thursday, August 26, 2010
శ్వాస ఉందని సంభరపడితే
శ్వాసే ఉందని గమనించు ఎక్కడికి వెళ్ళిపోకుండా నీలోనే ధ్యానించు
శ్వాసే ఉందని విశ్వసించు విశ్వమంతా శ్వాస గమనాన్ని మేల్కోల్పు
శ్వాస ఉందని ఉన్నప్పుడే గుర్తించకపోతే ధ్యానించే అవకాశం రాదేమో
విశ్వమే నీకు జీవమై నీలో జీవిస్తున్నా
శ్వాసే విశ్వమై నిన్ను బ్రంహాండంలో జీవింపజేస్తున్నా గ్రహించని భావమా
విశ్వ జీవులలో జీవిస్తున్న శ్వాస మేధస్సులో ఆలోచనను కలిగిస్తున్నది
ఆలోచనలతో విజ్ఞానించే నీవు నీ శ్వాసను గుర్తించలేకపోతే ధ్యానించలేవు
దిక్కులు లేని కర్మ కాలంలో
మహా ఆలోచనలు ఊహించుటకేగాని ఏ కార్యాలు సాగలేకపోతున్నాయి
విజ్ఞానానికి కాలం సహకరించే అవకాశం రాదనీ తెలిసినా ఏం చేయలేకపోతున్నా
నేనే మహా కార్యాలను ప్రారంభించటం లేదు ఎందుకో భాధ్యతలను వీడలేకపోతున్నా
1947 సంవత్సర కాలానికి ముందే
2000 సంవత్సర కాలానికి భారత జనాభాలో ఎందరు గాంధీజీ లు జన్మించారు
నేటికీ ఆనాటి గాంధీజీలా ఎవరిలో భావాలు కలగడం లేదే ఎందుకు ఈ స్థితి
నేటికీ ఎందరో నాథూరాం గాడ్సే లు వెలిసినా ప్రపంచాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు
నగరములలో జనసంఖ్య అధికమై
ఆస్తులు అంతస్తులు పరిశ్రమలు రహదార్లు దిక్కులేని విధంగా వెలుస్తున్నాయి
వాహనాల ప్రయాణాలు అధికమై అర్థం కాని జనాలు ఇరుకుగా ఇబ్బందులతో
ఎక్కడ ప్రయాణించినా దుర్వాసన దురలవాట్లు అశుభ్రత వస్త్రములతో ఇక్కట్లే
శుభ్రత లేక ప్రయాణము చేయలేక నా మేధస్సు పనిచేయక విధితో జీవిస్తున్నా
సమాజాన్ని మార్చే కోటీశ్వర్లు ఇంకా జన్మించలేదా ఆర్థిక లాభాలకే జన్మిస్తున్నారా
కాలమే దారి చూపునా ఆలోచనలకే
సతమతమయ్యే మేధస్సులో ఆలోచనల భావాలు ఎన్నెన్నో కలుగుతున్నాయే
ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉండాలో కాలమే నిర్ణయించునా నేనే నిర్ణయించుకోనా
కాలం కొన్ని సార్లు కొన్ని వేళలో అవకాశం కల్పిస్తే కొన్ని సార్లు నే నిర్ణయించుకోవాలా
ఎవరు దారి చూపినా మనం దేనికైనా ఓ ప్రయత్నం చేయక తప్పదని తెలుసుకో
Monday, August 23, 2010
నీవు ఉన్న చోట నీవు ఆలోచిస్తున్నా
నేను ఉన్న చోట నేను ఆలోచిస్తూ
నీవు ఉన్న చోట కూడా నేనే ఆలోచిస్తున్నా
ఎవరు ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నా
నేను అక్కడక్కడ మీ మేధస్సులో ఆలోచిస్తుంటా
ప్రతి జీవి మేధస్సులో నా మేధస్సు విజ్ఞానం కలగాలని
విశ్వమున ప్రతి అణువులో సూక్ష్మమై ఆలోచిస్తూనే ఉన్నా
ఎటువంటి సూక్ష్మ భయాలు లేనివారే
తన గురించి ఆలోచించక లోక భవిష్యత్కై విశ్వ కార్యాలను నడిపిస్తారు
విశ్వ విజ్ఞానంతో విశ్వ కార్యాలను చేస్తే జగతి ప్రశాంతంగా ఉంటుంది
ప్రశాంతంగా జీవించుటకై అజ్ఞానాన్ని తొలగించుటకై విశ్వ కార్యాలను సాగించాలి
నాలో విశ్వ కార్యాలకు సమయం ఎప్పుడు వస్తుందో ఎదురుచూస్తూనే ఉన్నాను
ఆకాశం నీ శిరస్సుపై ఉన్నంతవరకు
ప్రకృతి నీతో ఉన్నంతవరకు నీ మేధస్సులో కాల అనుభవం ఉంటుంది
అనుభవంతో జీవిస్తున్నంత కాలం కాల ప్రభావాలు తెలుస్తూనే ఉంటాయి
నీకు తెలియని విషయాలను మరల అర్థమగుటకు ఆకాశాన్ని తిలకించు
ఆకాశంలో విజ్ఞానాన్ని గ్రహించగలిగితే ఆత్మ జ్ఞానం మేధస్సున కలుగును
ఆత్మ జ్ఞానంతో ఆకాశ నిర్మల తత్వ విశ్వ భావ విజ్ఞాన కమలాన్ని మేధస్సున ధరించగలవు
ఆకాశాన్ని గమనిస్తున్నంత వరకు
నీకు నీవే నీలో నీవే ఆలోచిస్తూ నీకు కలిగే భావాలను అర్థం చేసుకోవాలి
ఆకాశాన ఏర్పడే వర్ణ చిత్రాలను మనం అలాగే చిత్రీకరించవచ్చు చూడవచ్చు
ఆకాశాన ఏర్పడే చిత్రాలకు భావాలను మాత్రం ఖచ్చితంగా గ్రహించలేము
మేఘ మబ్బుల వలన వర్షాలు వస్తాయని తెలుస్తుందే తప్ప వేరే భావాలను గ్రహించలేము -
అనుభవం ఉంటే తప్ప కొన్ని భావాలను తెలుసుకోగలం గ్రహించగలం
విశ్వ భావాలను గ్రహించే ఆత్మ జ్ఞాన ధ్యాన మేధస్సు గల వారికే భావార్థాలు తెలుస్తాయి -
ఆత్మ జ్ఞానంతో ఆకాశాన్ని తిలకిస్తే నీలో విశ్వ విజ్ఞానం చేరుతూనే ఉంటుంది
ప్రతి జీవి మేధస్సు ఓ విశ్వ లోకముగా
ఎప్పుడైతే స్వతహాగా జీవించగలదో ఇక ఆ లోకం ప్రయాణిస్తూనే ఉంటుంది
ఎక్కడైనా వెళ్ళగలదు ఏదైనా చేయగలదు అజ్ఞానం లేదా విజ్ఞానం కావచ్చు
తల్లిదండ్రులను వదిలిపోవచ్చు ఎలాంటి కొత్త జీవితాన్నైనా ప్రారంభించవచ్చు
ప్రపంచములో ఎక్కడికైనా వెళ్లి ఎలాగైనా ఎవరితోనైనా జీవిస్తూ ఎదగవచ్చు
ఒక్క సారి మరణిస్తే ఆ చిన్న విశ్వ లోకం జగతిలో శూన్యమై పోతుంది
శూన్యమయ్యే విశ్వ మేధస్సు లోకాలు మహా విశ్వమున అజ్ఞాన లోకమైతే
ఎన్నో లోకాలన్నీ అజ్ఞానమై మహా విశ్వమంతా అజ్ఞానంతో గడిచిపోతుంది
నీ మేధస్సు లోకాన్ని మహా విశ్వ లోకానికి విజ్ఞానం అందిచేలా ఆలోచించాలి
Sunday, August 22, 2010
ప్రపంచమున విశ్వ కార్యాలను
ధ్యాన సాధన చేయండి ఐనా విశ్వ కార్యాలను చేయుటకు అవకాశం కలగకపోతే
నా భావాలను తెలుకొనుటకు ప్రయత్నించండి ఐనా మీలో ఏ సందేహమైనా ఉంటే
నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఓ మహా గొప్ప కార్య ప్రణాళికను తెలుపవచ్చు
విశ్వ కార్యాలను సాగిస్తేనే ప్రపంచములో శాంతి స్వరూపాలు వెలిసిపోతాయి
విశ్వ జీవిగా ఎంత ఎదిగినా గతాన్ని
నేటి లక్ష్యంతో పాటు గత లక్ష్యాన్ని కూడా సాధించేందుకు ప్రయత్నించాలి
గతాన్ని అవగాహన చేసుకుంటే మనకు కావలసిన విషయాలు తెలుస్తాయి
గతంలో ఎన్నో విషయాల అనుభవ విజ్ఞాన ప్రణాళికలు దాగి ఉంటాయి
గత చరిత్ర అవగాహన లేకపోతే ఎన్నో తోచని కొత్త సమస్యలు తలెత్తుతాయి
Saturday, August 21, 2010
విశ్వమున ఏ సమస్యలు ఎన్ని
ఎలాంటివి ఎవరికి ఉన్నాయో తెలుసుకుంటూనే ఉన్నా
సమస్యలకు వివిధ పరిష్కార మార్గాలను కనిపెడుతున్నా
చాలా సమస్యలకు ధ్యానమే ఆత్మ విజ్ఞాన పరిష్కారము
విశ్వమున నీవు అనుకున్నట్లుగా
అలా తెలుపగలిగితే జన సంఖ్య అసంఖ్యాకముగా పెరుగుటలో అజ్ఞాన అర్థమే
జీవించుటలో సమస్యలు వస్తాయని తెలిసినా జన సంఖ్య అసంఖ్యాకముగానే
మనం అనుకున్నట్లుగా ఏ విధమైన మహా కార్యాలలో ఒకటైనా జరిగిందా
మన వాళ్ళకైనా అలా జరుగుతున్నాయా జరగలేనప్పుడు అసంఖ్యాక జనమెందుకు -
నాలో వేల కోట్ల మహా కార్యాలున్నా ఇంతవరకు ఒక ఆశయం కూడా నెరవేరలేదు -
నెరవేరని ఆశయాలతో జన సంఖ్య అసంఖ్యాకమై అందరికి సమస్యలు ఏర్పడుతున్నాయి -
మన విజ్ఞానం అసంఖ్యాక జనాభ పెరుగుటకైతే మనం సాధించినది శూన్యమేనని నా భావన -
ఎన్నో విధాల మహాత్మ విజ్ఞానంతో ఆలోచించినా అసంఖ్యాక జనాభ అవసరం లేదని నాలో -
ఆకాశాన కనిపించే వాటితో విజ్ఞానాన్ని
ఆకాశాన ఎన్ని నేర్చినా ఇంకా ఎన్నో ప్రతి క్షణం తెలుపుతూనే ఉంటుంది
ఎల్లప్పుడు అందరికి అందుబాటులో ఉండే గురువుగా భోదిస్తూనే ఉంటుంది
ఆకాశాన్ని తిలకించుటలో నేర్పరి ఐతే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి
మహా విజ్ఞానాన్ని విశ్వ విజ్ఞానంగా తెలుసుకుంటే మరొకరికి భోదించగలవు
Everything never ends
Everything never starts at a time, the changes creates/happens along with the time -
The Univers starts from an atom from some natural power along with so many changes -
The time never ends, it is going without anything like unknown imaginatin -
Before starts an Universe, the time started already -
We don't know the starting and ending time -
But my intent reaches the imagination before time starts and also ends -
కోటి భావాలను తెలిపిన నేను మరో
వంద భావాలను వందేళ్ళు గుర్తుండేలా మహా అద్భుతంగా తెలుపనా
భావాలతో మేధస్సును మార్చనా విశ్వంలో మార్పు కలిగించనా
జీవించుటలో ప్రపంచ జ్ఞానాన్ని నేర్చినా విశ్వవిజ్ఞానాన్ని తెలుసుకోవాలి
విశ్వ విజ్ఞానం తెలిసినా ప్రపంచమున జీవిస్తూ విశ్వాన్ని తిలకించాలి
విశ్వమున ఆకాశము జీవిస్తున్నట్లు నీ విశ్వవిజ్ఞాన భావనలు నిలిచిపోవాలి
మరణించిన తర్వాత నేవేమి చేయలేవు
మరణమునకు ముందే మహా అద్భుత విశ్వ భావ కార్యాలను సాగించు
విశ్వ కార్యాలను నీవు సాగిస్తావని నీకు మానవ విజ్ఞాన జన్మ కలిగినది
మరెవరూ విశ్వ కార్యాలను సాగించలేరని నీవు ఆత్మ జ్ఞానం చెందావు
ఆత్మ జ్ఞానంతో విశ్వ కార్యాలను ఆశయంగా సాగించేందుకు ప్రయత్నించు
నీ లక్ష్యానికి మానవులలో విశ్వ చైతన్యం కలుగుందని భావిస్తున్నాను
నా భావన ఆశయ లక్ష్యాన్ని నేనే తెలుపుకుంటున్నా అవకాశమునకై
Friday, August 20, 2010
ప్రపంచాన్నే ఆలోచిస్తున్నారు గాని
ప్రపంచ విజ్ఞానం తప్ప విశ్వ విజ్ఞానం మానవులకు అర్థమగుటలేదు
బ్రంహాండ జగతి విషయాలు ఆకాశ భావాలు ఎవరికీ తెలియుటలేదు
ఎంత కాలం ఆలోచించినా అర్థమగుటలేదంటే జీవితం ఎలా సాగుతుందో
మనిషికిలేని సందేహాలు ఇతర
విజ్ఞాన ఆలోచనల మేధస్సు ఉన్న నీకే తోచడం లేదంటే పరమార్థము ఏమిటి
మనిషిగా ఆలోచిస్తే అర్థంకాని జీవార్థమున దాగినది విశ్వ జీవిత సమ భావన
సమ భావాలలో కలిగే విశ్వ స్వభావాలలో సందేహాలకు సందేశమే లభించును
విగ్రహాలను ఎంతగా వజ్ర వైడూర్య
ఆకాశాన కనిపించే విశ్వ రూప భావన నాలో కలగటం లేదు
విగ్రహాలను నిర్మించడం అలంకరించడం పూజించడం కన్నా
ఆకాశాన్ని కొన్ని క్షణాలు భావనతో తిలికించడం శ్రేష్టమైనది
సూర్యోదయ సూర్యాస్తములను తిలకించడం మహా శ్రేష్టమైనది
ధ్యానించడం మహా అద్భుతమైన శ్రేష్టతగల దివ్య కార్యము
చరిత్ర విధానాన్ని తెలిపేందుకు విగ్రహాలను శుభ్ర పరచండి
The knowledge is not in one
నేను మరణించిన తర్వాత నా దేహాన్ని
నా సమాధి చుట్టూ ఏ విధమైన కృత్రిమ రూపాలు కట్టడాలు ఉండకూడదు
సూక్ష్మమైన కృతిమ రూపాలు కూడా ఉండకూడదు చాలా జాగ్రత్త వహించండి
మనిషి నాటిన చెట్టు కూడా అక్కడ ఉండకూడదనే నేను తెలుపుతున్నాను
ఏ విధమైన త్రవ్వకాలు అక్కడ జరగరాదు ఆ ప్రాంతాన్ని అశుభ్రత చేయరాదు
ప్రాంతమంతా సహజమైన ప్రకృతిగా ఆకాశపు అంచులు మాత్రమే కనిపించాలి
ప్రహరి గోడ కూడా ఆ ప్రాంతాన నిర్మించరాదు ఒక వేళ నిర్మిస్తే సమాధి నుండి కనిపించరాదు -
ప్రాంతమంతా సూర్యోదయ సూర్యాస్తములు దివ్యంగా కనిపించేలా ఉండాలి
ఈ విధంగా ఉంటే విశ్వమున స్వచ్ఛత మహా భావాలతో ఉదయిస్తూనే ఉంటుంది
నా సమాధిని ఎవరూ దర్శించరాదు ఒక వేళ దర్శిస్తే అపవిత్రమవుతుంది
దర్శించాలనుకుంటే సమాధి నుండి చూస్తే కనిపించనంత దూరాన ఉండాలి (పాద రక్షకములు లేకుండా) -
నా దేహాన్ని పూడ్చి పెట్టేటప్పుడు ఆ ప్రాంతాన్ని పాద రక్షకములు తాకకుండా చూడండి (త్రవ్వేటప్పుడు కూడా) -
పూడ్చిన తర్వాత కూడా సమాధిపై ఏవి చల్లరాదు ఉంచరాదు పవిత్రమైన నీరు తప్ప -
జగతికి మహా భావాల ఆలోచనలు కలగాలంటే నా దేహాన్ని ఇలా ఉంచాలి -
ఇలా జరగకున్నను విశ్వమున నా స్థానం ఇలాగే దివ్య పవిత్రతతో ఉంటుంది -
నేనెప్పుడూ విశ్వమునే ఆలోచిస్తాను ఆకాశాన్నే చూస్తాను జీవుల శ్వాసలో ఉంటాను -
మనస్సునే మార్చుకో మనిషి తీరునే
మనిషిలోని మనస్సే మనిషి తీరును మార్చేయును
మనిషిగా తెలుసుకో మహాత్మగా ఆలోచించి మారిపో
మారని విజ్ఞానమునే మేధస్సున అన్వేషించి మారిపో
ఎప్పటికి మారని ఒకే సత్యాన్ని మేధస్సున దాచుకో
We have to change the World
I know the thoughts to change the world as great intent -
I received the messages from Universe for making changes -
The Universe said intentions to my inner knowledge -
Universe is not in outer of your body, it is inner of your body -
You can meditate yourself, the World changes as peace -
విశ్వ భావాలతో జీవించే మేధస్సు
పర భాషా బేధంలేని విశ్వ కంఠంతో పలికే భావాలకు స్పూర్తినిస్తుంది
స్వర భాషలో విశ్వ భాషా భావాలు పలికే విజ్ఞానం అనిర్వచనీయం
ఆత్మ తత్వాలతో కలిగే విశ్వ భాష భావాలు జగతికే మహా చైతన్యం
జగతిలో నా స్థానం ఎక్కడున్నా విశ్వ
జీవించుటలో ఎన్నో స్థానాలు మారుతున్నా విశ్వ విజ్ఞానం ఒకే విధంగా
మేధస్సులో ఎన్ని ఆలోచనలు కలిగినా భావాల అర్థాలు విజ్ఞానంగానే
కాల మార్పులు ఎలా సంభవించినా విశ్వ పరమార్థం మేధస్సున ఒకేలా
హంసా ధ్వని రాగమా హంసా స్వర
శాంతి స్వర గీతమా శాంతి స్వర నాదమా
జీవ ధ్వని స్వరాగమా జీవ స్వర వేదమా
మహా స్వర లోకమా మహా స్వర విశ్వమా
Thursday, August 19, 2010
విశ్వ జీవులలో ఎన్ని స్వర రాగ
భాషలలో స్వర రాగాలు సంగీతాలుగా సరిగమలు పలుకుతున్నాయి
పలికే పదాలకు సంగీత వాద్యాలు తోడై సప్త స్వరాలూ జీవిస్తున్నాయి
స్వరాలు నాదాలలో లీనమై విశ్వ భావాలకు సంగీత భాషలు వెలిసాయి
2010 ఆగస్టు 19 న - సాయంత్రం
సూర్యాస్తమున పడమర దిక్కున మేఘాల పొరలలో బంగారు లోకం వెలిసింది
సూర్య కిరణాలకు మేఘాలు సువర్ణాలతో మెరుస్తూ దివ్య కాంతిని సృష్టించాయి
15 నిమిషాల కాల వ్యవధిలో వెలిగిన కాంతులు నేత్రాలకు మహా విశ్వ అద్భుతాలే
మహాత్ముల రూపం కన్నా మహా స్వచ్ఛమైన తేజోదయంతో నన్ను దర్శించాయి
నా నేత్ర కాంతులు మేధస్సును చేరి విశ్వ తత్వ భావాలను తెలుపుతున్నాయి
ఇలాంటి విశ్వ భావ సూర్యాస్త మేఘ కిరణ లోకాలను విశ్వంలో ఎన్నో దర్శించాను
కుంకుమ తిలక నేత్ర రూప లోకాన్ని ఎన్నో విధాల ఆకాశాన దివ్యత్వంతో దర్శించాను
ఆకాశాన్ని తిలకించడం నేర్చుకుంటే విశ్వ భావాలు మీలో ఆధ్యాత్మతో కలుగుతాయి
ఎన్ని వేల కోట్ల మేధస్సులు వెలిసినా
సాంకేతిక విజ్ఞానం ఎంత అద్భుతమైనా విశ్వ కార్యాలను తెలుసుకోలేకపోతున్నారు
జీవితాలు సమాజమున సాగుతున్నట్లు అనుకుంటే విశ్వ భావాలు కలగవు
విశ్వ భావాలు లేని మేధస్సులు ఎన్ని వెలిసినా సమాజం మారని సమస్యలతోనే
విశ్వ క్షేమం కోసమే మహా విజ్ఞాననునకై ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ధ్యానించు
మనిషైనా సమాజాన్ని మార్చాలని
ఇతర జీవులు సమాజాన్ని మార్చగలవా తీర్చిదిద్దునా
సమాజం జీవితాలకు స్పూర్తి లేకుండా పోతుంది
మహానుభావాలు కూడా ఆర్థికంగా ఆలోచిస్తారు
ఏ ఆశ లేకుండా జీవించే ఇతర జీవులకు ఆలోచన లేదే
మహా ఆలోచన గల మనమే మార్చుకోలేకపోతే
సమాజం సమస్యలతో ప్రమాదాల దిశవైపు సాగుతుంది
కాలాన్ని క్షణాలతో వృధాగా వ్యర్థంగా సాగించవద్దు
మహా ఆలోచనలతో నవ సమాజ విశ్వాన్ని సృష్టించు
మార్చలేని సమాజాన్ని నేను
నా ఆలోచన భావాల విజ్ఞానాన్ని తెలుసుకోండి
తెలుసుకునే వారైతే చదివి మరచిపోతుంటారు
మార్చేవారైతే నాతో కలిసేందుకు ప్రయత్నించండి
మార్చరా విశ్వ జీవితాన్ని జీవులకు అందించరా
ప్రపంచాన్ని విశ్వ పరిపూర్ణతతో భావ
బహు జనులకు అర్థమగుటకు విజ్ఞానముగా నాతో చర్చించండి
శాంతియుత విశ్వ విజ్ఞానాన్ని విశ్వ భాష భావంతో తెలుసుకోండి
ఆత్మజ్ఞాన జీవితాన్ని పరిపూర్ణ మేధస్సుతో విశ్వజీవిగా సాగించండి
దేనినైనా మనం మేధస్సులో గుర్తుగా
మనలో ఓ ఆలోచన దానిపై ఏకాగ్రతతో కేంద్రీకృతమై ఉంటుంది
ఏకాగ్రతలో ఆ ఆలోచనను ఒక సారికంటే ఎక్కువగా ఆలోచిస్తుంది
ఎక్కువగా ఆలోచించుటలో దానిని అర్థవంతంగా జ్ఞాపకపరుస్తుంది
అర్థవంతంగా దాగిన దానిని మరల ఎప్పుడైనా గుర్తు చేసుకోవచ్చు
ఒక రూపం నీకు గుర్తొచ్చిందంటే
ఏది నీకు గుర్తొచ్చినా ఆనాటి ఆలోచనలు నీ మేధస్సులో దాగి ఉన్నాయనే
ప్రతీది ఆలోచనగా మేధస్సులో చేరిన తర్వాతనే మరో విధంగా చేరుతుంది
ఆలోచనగా మేధస్సులో చేరకపోతే నీకు గుర్తుండదు ఎలాంటివి గుర్తుకు రావు
ఆలోచనగా చేరిన తర్వాతనే నీవు మరల వేరే విధంగా జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు
రూపాన్నే కాదు ఏ విషయాన్నైనా ఆలోచనగా చేరితేనే జ్ఞాపకంగా ఉంటుంది
ఒక రూపాన్ని మేధస్సులో ఆలోచనగా
రూపాన్ని పదాలతో కూడా చిత్రించి మేధస్సున మహా గుర్తుగా దాచుకోవచ్చు
మేధస్సులో దేనినైనా ఏ విధంగానైనా అద్భుత సూక్ష్మంగా అమర్చుకోవచ్చు
రాబోయే కాలంలో ఏ విధమైన రూపాలను సృస్టించ గలరో నేడే ఊహించవచ్చు
నా మేధస్సులో దాగిన రూపాలు అత్యంత దివ్య అద్భుతంగా మెరుస్తున్నాయి
కాంతి తరంగాలతో విచిత్ర రూపాలను వివిధ సాంకేతిక విజ్ఞానంతో సృష్టించవచ్చు
Monday, August 16, 2010
విశ్వ భారతి విశ్వ జనని విశ్వ మాధురి
విశ్వమాతగా జనులలో అజ్ఞానాన్ని తొలగించు
అజ్ఞానమున దాగిన ఆవేదనను శాంత పరచు
దురలవాట్లు గల వారి శిరస్సులను ఖండించు
విశ్వ ప్రకృతిని కాపాడేందుకు తల్లివై రక్షించు
విశ్వ భారతి విశ్వ జనని విశ్వ మాధురి వందేమాతరం
Sunday, August 15, 2010
ఈ ప్రాణం నాది కాదని నేనే
ఏ జీవిని నేను చంపుతానో ఆ జీవి ప్రాణమే నాలో ఉంటుంది
మరల ఏ జీవినైనా చంపితే ఆ జీవి ప్రాణమే నాలో చేరుతుంది
ఒక జీవిని చంపేంతవరకు ఆ జీవి జీవించినట్లు భావిస్తాను
లేదంటే చంపినా జీవుల ప్రాణంతోనే జీవిస్తుంటాను
నేను కావాలని ఏ జీవిని చంపను పొరపాటున జరిగిపోతుంది
చీమైనా దోమైనా ఏదైనా చంపినా నాలో దాని ప్రాణం చేరుతుంది
ప్రతి జీవి నాకు ప్రాణమే అందుకే ఏ జీవిని అనవసరంగా చంపను
నా ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయింది మరణించి ఎన్నో సంవత్సరాలైనది
వందేమాతరం వందేమాతరం
విశ్వ విఖ్యాత గాంచిన గాంధీజీకి వందేమాతరం
విశ్వ ప్రముఖుల ప్రజ్ఞానులకు వందేమాతరం
విశ్వ ప్రఖ్యాత గాంచిన శాస్త్రవేత్తలకు వందేమాతరం
వేద భాషలను రచించిన తత్వవేత్తలకు వందేమాతరం
శ్రమిస్తున్న శ్రామికులకు తెలిపెదం వందేమాతరం
మహాత్ముల బాటలో నడిపించే వారికి వందేమాతరం
దేశములన్నీ విశ్వ చైతన్యం కావాలని వందేమాతరం
మానవులంతా ఇక్యమత్యంతో జీవించాలని వందేమాతరం
విశ్వమున స్పందన కలిగించే సూర్య చంద్రులకు వందేమాతరం
ప్రతి క్షణం అజ్ఞానాన్ని తొలగించు కోవటానికే పాడుకోవాలి వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందే...మాతరం
ప్రతి జీవిని ప్రేమించే ఆత్మ జ్ఞానులకు వందేమాతరం
ప్రకృతిని రక్షించే స్వచ్ఛంద సేవకులకు వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందే...మాతరం
( This goes to get an Award in my intent )
విశ్వమున ఒక్కసారి మానవుడిగా
మరో జన్మైనా మరో అవతారమైనా మనకు అవసరం లేదనే తెలుపుతున్నా
మరో జన్మలలో మరల మానవుడిగా జన్మిస్తామో లేదో మనకు తెలియదు
ఒక్కసారి మరణించినామంటే మరల ఇలాంటి విజ్ఞాన ధ్యాస ఏనాటికి కలగదు
ఇంతటి విజ్ఞానాన్ని మరల ఏ జన్మలో తెలుసుకోవడానికి అవకాశం రాదు
మిగతా జన్మలలో మనకు ఆహారం జాతి తరాల ధ్యాస తప్ప మరొకటి లేదు
మహా భావాలు వస్తువులు ధనం సాంకేతిక విజ్ఞానం వాహనాలు ఏవీ ఉండవు
నేటి మానవ జన్మనే సార్థకం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నించాలి
ఆత్మ జ్ఞానంతో ఒకే ఒక మానవ జన్మను సమర్దవంతంగా ముగించుకోండి
Saturday, August 14, 2010
విశ్వ జనులకు తెలుపుదాం
అమర వీరులకు పలుకుదాం నీరాజనం
మహాత్ములకు అర్పించెదం మహోజ్వలం
శాస్త్రీయులకు తెలుపుదాం సంకీర్తనం
మహానుభావులకు తెలుపుదాం వందనం
విశ్వ జీవులకు ఇచ్చేద్దాం స్వేచ్చా భావం
14 ఆగస్టు 2010 నాకు అనిపించింది
చీకటవుతున్న వేళలో 7 గంటల సమయాన
పడమర దిక్కున కనిపించిన మహా తేజస్సు నక్షత్రం
9 గంటల సమయంలో అస్తమించింది
మరల 10 గంటలకు తూర్పున చూస్తుంటే
అదే తేజస్సు గల మహా నక్షత్రం కనిపించింది
ఒకే నక్షత్రం పడమర అస్తమించి తూర్పున ఉదయించిందేమో
నక్షత్రాలను కొన్ని నిమిషాలు తిలకించడం నా అలవాటు
నా అనుభవ పూర్వకంగా నాకు అనిపించింది ఇలా
పరిణామం ఆకార రూపం దివ్య తేజస్సు ప్రకాశించే విధానం
భావ స్వభావం సమయ కాంతి కిరణ దిశలు అన్నీ అలాగే
ఆ అనుభూతి విశ్వమున నా ఒక్కడిదే
విశ్వమంతా నాదే విశ్వమున
విశ్వములో ప్రతి అణువు నాదే వాటి భావ స్వభావాలు నావే
విశ్వమే నేనని నా శ్వాసలో ప్రతి రూపము దాగి ఉన్నది
జీవరాసులలో ఉన్నది నా శ్వాసేనని జీవించుటలో గ్రహించాను
శ్వాసతోనే జీవించుటలో విశ్వమంతా నాదేనని తెలుసుతున్నది
నిద్రించని భావాలు ఆకలి కలగనప్పుడు
జీవితంలో ఆహార నిద్రలు ఇక ఎన్నడూ కలగవని మేలుకొంటాం
ప్రయాణమున అలసట లేక విశ్వమంతా విజ్ఞానంతో తిరగగలిగితే
మరో విశ్వంలో ధ్యానిస్తూ అనంత విశ్వ లోకాలను తిలకించవచ్చు
శూన్యాన్ని కూడా అన్వేషించి మర్మ లోకానికి వెళ్లి జీవించవచ్చు
అపారమైన సాధన ఆత్మ జ్ఞానముచే సాగిస్తే శ్వాసే విశ్వమవుతుంది
విశ్వమునకు కాల భావాలే కాని ఆహార నిద్రలు ఉండవని తెలుస్తుంది
Friday, August 13, 2010
అయ్యో! జీవితం ఇంతే కదా ఏమో
నీకు తెలుసా ఇంతేనని నేను ఇంకెంతో అనుకున్నా
తెలిసిందా ఇంతేనట మనమే ఎంతో ఉందని ఊహించాం
ఇంతే ఐతే ఇంకా ఎందుకు ఇలా జీవిస్తూనే ఉన్నాం
వృద్ధాప్యం వచ్చినా మరణించలేక వందేళ్ళు దాటేస్తున్నాం
కొందరికి ఇంతే మరి కొందరికి ఇంకెంతో ఉంటుంది
ఇంతేనని తెలిసినా ఇంకెంతో ఉందని జీవిస్తూనే ఉన్నాము
ఇంకెంతో ఉందని ఏదో ఒకదానిని తెలుసుకుంటూనే ఉన్నాం
ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియనిదే ఎంతోనని
జీవితం ఎంతైతేనేం మరణించేంతవరకు జీవించాలని
ఓ విజ్ఞాన జీవితాన్ని సాగిస్తూ విశ్వ ప్రయాణం చేయండి
గాలిలా వస్తున్న భావనను గమనిస్తే
ఆలోచనను కొంత సమయం సంపూర్ణంగా గమనిస్తే అర్థమే తెలుస్తుంది
ఆలోచనలో దాగిన అర్థాన్ని గమనిస్తే విజ్ఞానంగా పరమార్థమే తెలుస్తుంది
పరమార్థంతో కూడిన విజ్ఞాన ఆలోచనను గమనిస్తే సత్యమేదో తెలుస్తుంది
సత్యాన్ని తెలుసుకునే వరకు ఏ అజ్ఞాన కార్యాన్ని చేయకని ఆలోచనే తెలుపును
విజ్ఞానంగా సాగిపోవాలని మన మేధస్సులో ఆలోచనలు తెలుపుతున్నాయి
గాలిలా వచ్చే ఆలోచనలను మేధస్సులో సేకరిస్తే విజ్ఞానంగా ఎదుగుతాము
ఆలోచనలను వదిలేస్తే విజ్ఞానంలేని అల్ప జ్ఞానులుగా మిగిలిపోతాము
గాలి ఎప్పుడూ ఎక్కడెక్కడో వీస్తున్నట్లు ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి
ఆలోచనలను ఎంత విజ్ఞానంగా మార్చుకుంటే అంత గొప్పవారవుతాము
విశ్వ భూమిలో జన్మించినాము
విశ్వమంతా జీవించే జీవులన్నీ ఒక్కటేనని ఆలోచిస్తున్నాము
విశ్వ చైతన్యమే విశ్వ విజ్ఞాన ఆత్మ జ్ఞానమని ఎదుగుతున్నాము
విశ్వమున ఏదైనా మన జీవితానికి అనుభవమేనని తెలుపుకుంటాము
విశ్వాన్ని సురక్షితంగా కాపాడుకుంటేనే మనకు ప్రాణ హారము
విశ్వాన్ని మరచిపోలేము మరో జన్మకైనా విశ్వ భూమియే గమ్యము
Thursday, August 12, 2010
అశుభ్రత నుండి ఉద్భవించిన
ఉద్భవించిన జీవరాసుల నుండి మరెన్నో జీవములు
జీవములు ఎక్కువైతే మనం నివశించే ప్రాంతం అశుభ్రతగా
మన ప్రాంతాన్ని చాల శుభ్రతగా ఉంచుకోండి
శుభ్రత లేకపోతే మరెన్నో అశుభ్రత జీవములు కోట్లలో
అశుభ్రత ఉన్న చోట మానవుడు జీవించరాదు
శుభ్రత యందు శుభం కలగాలని అశుభ్రతతో అశుభాన్ని తొలగించు
శుభ్రతతో అనారోగ్యాన్ని కూడా తొలగించుకోవచ్చు
ఇంట్లో ఎంత తక్కువ వస్తువులుంటే అంత శుభ్రతగా ఉంటుంది
రకరకాల జీవరాశులతో మానవుడు సతమతమవుతున్నాడు
మన శ్వాసలో శుభ్రత లేక భగవంతుడు విశ్వమున లేడు
నాలో ఆహారం కన్నా ఆలోచనలే
ఆకలితో కొంత సమయం జీవించవచ్చు ఆలోచనలేక జీవించలేము
ఆలోచనలు ఎక్కువైతే ఆకలి కూడా ఎక్కువవుతుందని ఆలోచించినా
ఆలోచిస్తూనే ఆలోచనలతో జీవిస్తూ ఆకలిని మరచిపోతున్నా
ఆకలిని మరిచే ఆలోచనకై ఆలోచిస్తూనే విశ్వమున అన్వేషిస్తున్నా
పల్లె జీవితాలు ఆనాటి జ్ఞాపకాల
పట్టణ జీవితాలు నేటి ఉద్యోగాల కృత్రిమ తత్వాలే
పల్లె భావాలు ప్రకృతిని చూపే సహజ విజ్ఞానం
పట్టణ భావాలు కృత్రిమాన్ని తెలిపే ఆధునిక సాంకేతిక విజ్ఞానం
విశ్వమే కర్మ సిద్ధాంతం కాలమే
విశ్వ కాలమున మానవుడు అజ్ఞానాన్ని తొలిగిస్తూ విజ్ఞానంగా సాగుతున్నాడు
విజ్ఞానముతో అజ్ఞానాన్ని కూడా మానవుడు కలిగి ఉండుటయే కర్మ సిద్ధాంతం
విశ్వమున జరిగే ప్రతి కార్యములో కారణము సరి కాకపోతే కర్మ సంభవిస్తుంది
విశ్వమున కలిగేవన్నీ సమస్యలే కనుక విశ్వం కర్మ సిద్ధాంతంతో సాగుతుంది
మానవుడు అజ్ఞాన ప్రవాహాన్ని మేధస్సున తొలగించుకుంటూ ముందుకు సాగాలి
ప్రతి జీవిలో ప్రతి కార్యములో ఉన్న లోపమే కర్మ సిద్ధాంతంగా తెలుపబడుతున్నది
కాలం ఎప్పుడూ మనిషిలో విజ్ఞానాన్ని మరిపించి అజ్ఞానాన్ని కలిగిస్తుంటుంది
అజ్ఞానాన్ని కార్యానికి ముందుగానే గ్రహించి కార్య కారణముతో సాగితేనే విజ్ఞాన కార్యమవుతుంది -
ప్రతి జీవి విజ్ఞాన కార్యాలు మాత్రమే చేయదు కాలం ఎప్పుడు విజ్ఞానాన్నే తెలుపదు
అజ్ఞాన విజ్ఞాన కార్యాలతో ప్రతి జీవి కర్మతో జీవిస్తూ విశ్వమున ప్రతీది కర్మ సిద్ధాంతంతో జరుగుతుంది -
విశ్వమున పదహారు దిక్కులలో
క్షణములో పదహారు దిక్కులలో నిఘా ఉన్నా కర్మ మరో దిక్కున ఉదయిస్తున్నది
కర్మ కలుగుటకు దిక్కు లేదు క్షణమే అజ్ఞాన కాలంగా గడిచిపోతుంది
పొరపాటైనా ఆత్రేయమైనా అజ్ఞానమైనా సోమరి ఐనా ఆవేదనైనా కర్మ సంభవిస్తుంది
కొన్ని క్షణాలు విజ్ఞానంగా గడిచినా మరో క్షణం కర్మకే సంభవిస్తుంది
కర్మ మేధస్సులో ఉంది అలాగే జీవన స్థితిలో ఉంది అలాగే కాలంతో సాగుతుంది
అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు నశించే విధంగా కలిగే అజ్ఞానమే కర్మ
మనకు నచ్చనిదే కర్మ అనుభవించ లేనిదే కర్మ తెలియక జరిగేదే కర్మ
కర్మ జరుగుతుందని తెలిసినా జాగ్రత్త వహించలేని సూక్ష్మ కాలమే అజ్ఞాన మేధస్సు -
మనకు తెలియని కాలమున మరో విధంగా జరిగిపోయి మరో సమయానికి తెలిసేది కర్మయే -
మరొకరి ద్వారా కలిగేది కర్మయే విజ్ఞానమైనా అందులో దాగినది కర్మ సిద్ధాంతమే
జీవితమంతా కర్మ సిద్ధాంతమే జరిగిపోవుటలో గ్రహిస్తేనే కర్మగా లేదంటే సమస్యల జీవితం -
సమస్యలను తొలగించుకుంటూ వెళ్ళిపోతే విజ్ఞానంగా జీవితం సాగిపోతుంది
మనిషిలోని బలహీనతే కర్మగా భావించవలసి వస్తుంది విజయం లేకపోయినా కర్మేనని తెలుస్తుంది -
Monday, August 9, 2010
జీవితాన్ని విశ్వధాతలా
మరలరాని జీవితం తెలుసుకోవాలన్నా మరో జన్మలో గుర్తు రాదే
నేటి జన్మలో మారకపోతే ఇక ఏ జన్మకైనా సామాన్యమైన జీవితమే
విశ్వ ధాతలా వివేకానందుడివై విశ్వ విజ్ఞానాన్ని ఎందరికో విశదీకరించు
నీవు శూన్యమైపోయేలోగా దివ్య కాంతిని మేధస్సున వెలిగించు
ఈ జీవితమే మహాత్ముని ఆత్మ దశ దివ్య జ్ఞాన కాల సమయము
మరల రాని మహా అవకాశం వృధా ఐతే మాధవుడివి ఇక కాలేవు
Sunday, August 8, 2010
మనలోనే అందరు ఉన్నారు కాని
మన సమస్యలే మనకు ముఖ్యమని ప్రతి రోజు ఆలోచిస్తున్నాము
మనలోనే గాంధి నెహ్రూ శాస్త్రి పటేల్ చంద్రబోస్ లా ఎందరో ఉన్నారు
ఆలోచనలతో ఎన్నో సృష్టిస్తున్న కాలంలో గాంధీలా జీవించలేక పోతున్నాం
గాంధీలా జీవించాలంటే ఏ కార్యాలు చేయాలో తెలియుటలేదా
విజ్ఞానంగా నీవు ఎలా ఎదుగుతున్నావో అలాగే గాంధీలా జీవించు
మితంగా మాట్లాడుతూ ప్రశాంతంగా జీవిస్తూ విజ్ఞానాన్ని తెలపడం
సమాజాన్ని ఓ గొప్ప బాటలో శాంతియుతంగా ఓర్పుతో నడిపించడం
ప్రతి మనిషిలో అన్ని రకాల భావాలు ఆలోచన గుణాలు ఉంటాయి
మనం ఎవరిలా కావాలన్నా అలాగా జీవించగలం గమనిస్తున్నారా
మానవుడే అన్ని రకాలుగా అన్ని విధాల గొప్పగా జీవించవచ్చు
కృష్ణుడు యేసు నానక్ రామకృష్ణ వివేకానందా బుద్దా అందరూ మానవులే
మానవుడే విశ్వ విజ్ఞానంతో మాధవుడై తమ రీతిలో జీవించినవారే
ఆలోచన విధానంలోనే అంతా ఉందని అదే మనల్ని గొప్పగా మార్చుతుంది
ఆలోచనయే మానవ విశ్వ రూపం సాధనయే మాధవ విశ్వ విజ్ఞానం
విశ్వం మనలో ఉందని తెలిసేదెలా
మన మేధస్సులో ఆలోచనలే విశ్వమని
మన విజ్ఞానమే విశ్వ విజ్ఞానమని తెలియునులే
మనం సృస్టించేవన్నీ మేధస్సులోని ఆలోచనలతోనే
ఆలోచనలే అన్నింటికీ మూలాధార విజ్ఞాన సోపానం
ఏ జీవి ఐనా తన మేధస్సుతో భావిస్తూ జీవిస్తున్నది
భావనల ఆలోచనలే విశ్వ విజ్ఞానమని మన మేధస్సులోనే
మేధస్సుతోనే ఎన్నో సృష్టించాం గుర్తించాం తెలుసుకున్నాం
ఇంకా ఎన్నింటినో తెలుసుకుంటూనే ఎన్నో సృష్టిస్తూనే ఉన్నాం
మనలో కలిగిన ఆలోచనకు మనమే అద్భుత రూపాన్ని ఇస్తున్నాం
ఆధ్యాత్మకంగా ఆలోచిస్తే ప్రతీది మనలో ఉన్నట్లు విశ్వం మనలోనిదేనని
Saturday, August 7, 2010
ఆది భిక్షువు విశ్వమున విజ్ఞానముకై
విశ్వమున యుగాలుగా వేచియున్నా విజ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేకపోతున్నారు
విశ్వాత్మ యోగులందరూ మౌనంతో ధ్యానిస్తూనే ఉన్నారుగాని సూక్ష్మ కదలికలేదు
ఆది భిక్షువే కైలాసమున ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానమును తెలుసుకుంటూనే ఉన్నాడు -
విశ్వమున తెలియని విజ్ఞానం అనంతముగా దాగి ఉన్నట్లు ఎవరికి తెలియకపోతున్నది -
విశ్వ విజ్ఞానాన్ని తరలించే మానవ మూర్తి ఇంకా జన్మించలేదా మనకు ఆ శక్తి లేదా -
మన మేధస్సుకు విశ్వ విజ్ఞానాన్ని తరలించే ఆత్మ జ్ఞానం ఉందని గ్రహించి అన్వేషించండి -
మేధస్సులో మరో విశ్వం ఉందని ఆత్మ అన్వేషణతో తెలుసుకుంటే విశ్వ విజ్ఞానం తెలిసినట్లే -
సూక్ష్మ జీవిలో మహా యోగి జీవించే
అణువులో మహాత్మ జీవిస్తున్నట్లు మనకు తెలియకపోతున్నది
పరమాణువులో పరమాత్మ విశ్వాత్మగా ప్రతి అణువులో ఉన్నాడు
మానవుడిగా మనకు అన్నీ సౌకర్యాలున్నా ఆత్మగా జీవించలేకపోతే
విశ్వమున సమస్యల జీవితం అజ్ఞానంతోనే తరతరాలుగా సాగుతుంది
విశ్వ విజ్ఞానంతో జీవించేందుకు నీకు మానవ రూపం మరల రానే రాదు
ఒకరు తెలిపెంత వరకు మనలో
మనలో దుఖ్ఖ విచక్షణ లేదని క్షుణ్ణంగా తెలుస్తుంది
దుఖ్ఖము నుండే ఆత్మ అన్వేషణ మొదలు కావాలి
సూక్ష్మ సంతోషంతో మహా దుఖ్ఖాన్ని మరచిపోతున్నాం
మన దుఖ్ఖాన్ని మరచిపోయినా మన వాళ్లకు దుఖ్ఖము కలగరాదని
మనలో అన్వేషణ లేకపోతే ఆత్మ జ్ఞానం తెలియక చింతిస్తూనే ఉంటాం
మన దుఖ్ఖానికి మనమే భాధ్యులం మనమే వదిలించుకోవాలి
విశ్వ విజ్ఞాన ధ్యానమే మన ఆత్మ జ్ఞాన సంతోషము
ఎవరి మేధస్సులో ఏమున్నదని
ఎవరు ఎంతటి వారని మన ఆలోచనకు సరికాదు
మన మేధస్సును ఆత్మ విజ్ఞానంతో మెరుగుపరచాలి
మనస్సే మనకు మౌనమై మన ఆత్మలో అన్వేషిస్తే
ఆత్మ జ్ఞానం మేధస్సున కలిగి విశ్వ విజ్ఞానులవుతాం
మీరు జీవించే విశ్వ కాలము మరల
మరో జన్మతో మరో విధంగా జీవితం వృధా అవుతుంది
ఈ జన్మలోనే ఆత్మ జ్ఞానిగా జీవించుటకు ఎదగండి
ఆత్మ జ్ఞానమునకై ధ్యాన సాధనయే ముఖ్య మార్గము
విశ్వ విధాతకే ఆత్మ జ్ఞానమున
విశ్వ విజ్ఞానమున సందేహము కలిగినట్లేనని నా భావన
విశ్వమున సందేహము లేకుండా జీవించు ఆత్మ జ్ఞాని
ఏ లోకమున లేకపోతే ఎంతటి విచారకరమో తెలుసుకో
నీవైనా విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించు
స్వర్గాన్ని కూడా వద్దనుకుంటే సుఖం
సువర్ణ లోకాన్ని కూడా వద్దనుకుంటే ఆశ లేదనే
ఏ లోకమైనా వద్దనుకుంటే జీవించడం ఎలా
విశ్వ విజ్ఞాన లోకమే నాకు ఆత్మ జ్ఞాన జీవితం
కొత్త బంగారు లోకం మాకు కావాలి
కొత్త విజ్ఞాన లోకం ఎవరికి అవుతుంది సొంతం
ఆత్మ జ్ఞానం ఉన్నవారికే విజ్ఞాన లోకం సొంతం
విశ్వ విజ్ఞాన లోకంలో ఆత్మ జ్ఞానమే జీవితం
జీవించే ప్రతి మనిషికి కావాలి ఆత్మ జ్ఞానం
ఆత్మ జ్ఞానంతోనే సొంతమవుతుంది కొత్త విజ్ఞాన లోకం
ఆత్మ విజ్ఞానముననే కొత్త బంగారు లోకం
విశ్వ విజ్ఞానులు జీవించే లోకమే సువర్ణ లోకం
Friday, August 6, 2010
ఈ విశ్వం నీదేనని ఎవరో
నీకే వినపడుతున్నదని నీ మనస్సే అంటుందా
మేధస్సులో ఏదో దాగి ఉందని తెలియకపోతున్నదా
మాటల్లో చెప్పలేక మౌనం అనుకున్నంతలో మరల వినపడింది
విశ్వనాధుడే చెబుతున్నాడు ఈ విశ్వం నీదే మహా మహాదేశ్వరా
మానవ రూపంలో ఉన్న నీవే జగతికి మానవ మహాదేశ్వరుడవు
అందరిలో ఉన్నట్లు అందరిలా మానవుడవని అనుకుంటే పొరపాటే
నీ విజ్ఞానాన్ని విశ్వానికి తెలియజేయి ఎవరికి నీ జ్ఞానం తెలియుటలేదు
సమాజము అనుకుంటే నీవు నీలోనే విశ్వ విజ్ఞానాన్ని మరిచెదవు
ఆత్మ సంతృప్తి లేని జీవితం అజ్ఞాన జీవితమని తెలుసుకోవద్దు ఆత్మ జ్ఞానంతో జీవించు
Thursday, August 5, 2010
బ్రంహా ముహూర్తాన విశ్వ ప్రయాణము
విశ్వ ప్రయాణమున నక్షత్ర వెలుగులు విరజిమ్ముతున్నాయి
చీకటి తెలియని విధంగా దూరాన మెరిసే నక్షత్ర గమ్యానికై
ప్రయాణము ఒంటరిగా అడుగులతో సాగుతూనే ఉన్నది
ఏదో ఒక దానిని అందుకోవాలని సాగిపోతూనే ఉన్నాను
సూక్ష్మ వెలుగుతో నక్షత్రం కనిపిస్తున్నా ప్రయాణిస్తూనే ఉన్నా
సూక్ష్మ నక్షత్రాన్ని చేరుకున్న తర్వాత నేను నేనుగా శూన్యమైపోయా
అన్నీ వేల లక్షల కోట్లలలోనే
ప్రతి రోజు పని చేసేవారు ప్రయాణించేవారు వే ల కో లలో
ప్రతి సంవత్సరం పూర్తవుతున్న గృహాలు వే ల కో లలో
ప్రతి సంవత్సరం అవుతున్న పెళ్ళిళ్ళు వే ల కో లలో
ప్రతి సంవత్సరం కొత్తగా ఇంటిలో చేరుతున్నవారు వే ల కో లలో
ప్రతి సంవత్సరం జన్మిస్తున్నవారు వే ల కో లలో
ప్రతి సంవత్సరం అరుదుగా చనిపోతున్నవారు కోట్లల్లో
ప్రతి సంవత్సరం తయారవుతున్న వస్తువులు వాహనాలు వే ల కో లలో
ప్రపంచంలో అన్నీ వే ల కో లలో ఐతే రాబోయే కాలం ఎలా ఉంటుంది
మన జీత భత్యాలు కూడా వే ల కో లలో ఐతే ఎక్కడ ఏదీ దొరకదు
క్షణమేరా జీవితం మరో క్షణమైనా
ఏ క్షణమైనా క్షణమేరా అని అంటున్నది నా జీవితం
నిమిషమైనా ఎన్నో క్షణాలతో సాగే జీవితం
గడియయైనా యుగమైనా క్షణములతో సాగే జీవితం
క్షణమేలేనిది మరణమందున్నదేనని ఏ జీవితం
మొదలైన తర్వాత ఓ క్షణం మనది కాదన్నా మరణమే
Monday, August 2, 2010
చిరంజీవులతో మహా విశ్వ కార్యాన్ని
చిరంజీవిగా వస్తే విశ్వ కార్యాలు విశ్వ కాలానికి మార్పు తెస్తాయి
విశ్వ కార్యానికి ఓ సంవత్సర వ్యవధి కాలమే సరైన దివ్య నిర్ణయం
ఒక్క చిరంజీవైనా వస్తే విశ్వ కార్యాన్ని విశ్వమంతా తెలిసేలా నడిపిస్తా
ప్రతి రోజు ఒక్కొక్క ప్రాంతమున మార్పు కలుగుతూ సంవత్సరానికి
విశ్వమంతా మార్పు చెంది ఎన్నో సమస్యలు తగ్గిపోగలవని నా భావన
విశ్వ కార్యానికై చిరంజీవులకు తెలిసేలా విశ్వమంతా అన్వేషించండి
కాల ప్రభావంతో పరిస్థితులు మారకముందే నన్ను కలవగలరని నేను
గాంధీజి గెలిచాడు - ఓడిపోయాడు
దేశాన ఎక్కడో ఉదయించి అహింసా అనే సిద్ధాంతాన్ని జీర్ణం చేసుకుకొని
దేశమంతా ఒకటి కావాలని మన దేశమే మన రాజ్యమని మనమంతా ఒక్కటై
మనమే మన భూమిని దిద్దుకుందాం బానిసత్వాన్ని వదిలేద్దామని
ఆంగ్లేయులను తమ దేశానికి వెళ్ళగొట్టి స్వాతంత్ర్యాన్ని దక్కించుకున్నాడు
భారత దేశ స్వాతంత్ర్యంతో అందరిలో గాంధీజి గెలిచాడు
అందరిలో నుండే ఒక్కరైన నాథూరం గాడ్సే తనదైన శైలిలో గాంధీని ఓడించాడు
గాడ్సేతో యుద్ధం చేయకుండానే ఓడిపోయాడు
అవకాశముంటే గాడ్సేను కూడా గెలిపించేవాడు
యుద్ద వీరునికి వెన్నుపోటు పొడిచిన వీరుడు కాలేడు ఓడినవాడే కాగలడు
Sunday, August 1, 2010
ఎవరింటి గోల వారిదే - ఎవడి గోల
ప్రతి ఇంటిలో ఒక్కొక్క విధమైన గొడవ
ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క పరిస్థితి
ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా
ఏదో ఒక ఇంటి నుండి ఏదో ఒక గొడవ ప్రతి రోజు వినిపిస్తూనే ఉంటుంది
మనకు తెలియకున్నా జరిగిపోతూనే ఉంటాయి
మనిషి మారలేడు మార్చుకోలేడు
మన భావాలే మనకు ఇతరుల మధ్య తగాదగా ఏర్పడుతుంది
మన ఇంటిలో మనవాళ్ళతోనే చిరాకు చెందుతాం
పెద్ద వారైతే పక్కన వారిని చూసి నేనెప్పుడు అలా కావాలి
నా పిల్లలు ఎప్పుడు అలా సంపాదించాలి ఇతర విషయాలు ఎన్నో
మనిషికి ఆశ ఉన్నంత వరకు అంతే ఎవరూ మార్చలేరు
ఉన్న దానితో తృప్తిగా ఆరోగ్యంగా జీవించండి ఎవరి ఇష్టం వారిదే
మీకు ఏదైనా మార్పు కావాలనుకుంటే కాలమే సహకరిస్తుంది అనుకోండి
ప్రతి విషయాన్నీ గోల చేస్తే ఎవరూ సరిగా పని చేయలేరు
దీని ద్వారా ఇంకొకరి జీవితం కూడా అదోగతి - ప్రశాంతంగా ఆలోచించండి
Password Brain - very Secret
Every day you should start work by a Password in the Company
If you forgot the Password you unable to work
If you want to do the work and you need to create another Password by authorized person -
If you say anything to any person even secrets also but you should not say the "Particula Password" -
Now a days Educated person or Employee by using a Password to get money in ATM's (A/C Holder) -
In company's without Password no one can open the system/computer even unauthorized person also -
If a person forgot the Password or change the Password he never login into the system -
The Programmers / testers can use the Passwords to check weather the applications are running without any bugs -
until without any bugs they using so many passwords as well as user id's for filling the fields data -
Some Programmers / testers are appllied more than thousand different Passwords in different applications -
Some employees are login into different blogs games and social network sites by Passwords -
Different Bank Passwords, Entertainment site Passwords(SN), Office work Passwords and so many Passwords are in the Mind -
How to manage a person to remember all Passwords (Important : Passwords never written any where only in mind) -
Don't login into unnecessary sites because in future your memory loss by many Passwords to recollet -
నేడు వీస్తున్న గాలికి నా నాసికము
ఉచ్చ్వాస నిచ్చ్వాసములు కూడా శరీరములోనే జరుగుతున్నాయి
కలుషితమైన గాలికి ప్రాణ వాయువు లేక శరీరము చిక్కిపోతున్నది
పరిశ్రమలలో సాంకేతిక కృత్రిమ గాలికి ఆనారోగ్యమేగాని లాభం లేదు
నిద్రపోవుటలో కూడా కృత్రిమ గాలితో ఎన్నో రకాలుగా నశించిపోతున్నాం
రాబోయే సంవత్సరాలకు నాసికమున యంత్రములే అవసరం
జన్మతో నాసిక యంత్రమాట లేదంటే మరణమట అదే జీవితమట
ఇలాంటి పరిస్థితులు వచ్చినా జన సంఖ్య మాత్రం కొన్ని వేల లక్షల కోట్లలోనే
కొందరికి తినడానికి సరైన తిండి లేకున్నా కుటుంబాలుగా ఎందరో అన్నట్లు
ముక్కుకు యంత్రమే కదా చిలుకలా కోట్లలో ఇబ్బందులైనా
అనారోగ్యమైనా పెద్ద కుటుంబాలుగా జీవిస్తామంటున్నారు
----
సహజ ప్రాణ వాయువుకై ప్రకృతిలో జీవిద్దామంటే భూమి మనది కాదే
కొందామన్నా ధరలకు ఆస్తులే పొతే తినడానికి ఏమీ ఉండదే
ఒక వేళ సంపాదించి కొన్నా పక్కవాడు పరిశ్రమను స్థాపిస్తే
ఆహారాన్ని పండించే పంటలు కూడా కలుషితమై మనిషికి శక్తి లేక
ప్రపంచమంతా కృత్రిమ గాలితోనే అనారోగ్య ఆర్థిక ఇతర ఇబ్బందులే
మంచి ఆహారాన్ని భుజించండి ప్రకృతిని ఆశ్వాదించండి
పడమటి సంధ్యా నక్షత్రమా నీవు ఎలా
నా నేత్రములు కూడా కాంతితో నిండిపోయేలా మేధస్సు మెరుస్తున్నది
నీవు అస్తమించే వరకు నేత్రములు పక్కకు వాలటం లేదంటే అతిశయోక్తి లేదు
నీ యొక్క ప్రకాశవంతమైన తేజస్సు క్షణానికి ఎన్ని రకాలుగా మెరుస్తున్నదో
మహా వృక్షమున మహా యోగి
మర్మము మర్రి చెట్టులో ఉన్నట్లు మంత్రము తెలియలేదా ఇంతకు మునుపు
గౌతమ బుద్దుడు కూడా చెట్టు క్రిందనే జ్ఞానోదయం చెందినాడు
మహా ప్రాశాంతత నిచ్చే వృక్షాలను ఎప్పటికీ నరక రాదనే
వృక్షాలు మన శ్వాసకు శక్తిని ఇస్తాయి ఆహారం శరీరానికి శక్తినిస్తాయి
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
భూమి చీలికలతో అంచులు కూడా కనపడని విధంగా
అదురుటలో వర్షాలు మొదలై సముద్రంలో కెరటాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటే
తన బొటనవేలుకు సూక్ష్మ స్పర్శైనా కలగలేదంటే
అతని ధ్యాస మర్మమై ధ్యాన ధ్యాస వదలని కఠోర దీక్షలో ఉన్నాడనే
ఎక్కడినుండో అతని శిరస్సున ఓ చీమ చేరి తన త్రీనేత్రాన్ని చేరుతుంటే
అప్పుడు కలగిందట స్పర్శగా ఓ జీవి నన్ను కదిలిస్తున్నదని
చీమ తెలుపుటలో ఇలా అంటున్నది
ఘోర ప్రళయానికి నా సూక్ష్మ రూపము నిలవకపోతే నీవే దిక్కని అనుకున్నా
అందుకే " శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు "